మహాలక్ష్మి పథకాన్ని భారీ స్పందన.. అద్దె బస్సులకు TSRTC ప్రకటన

తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు, విద్యార్థినులు, యువతులు సద్వినియోగ పర్చుకుంటున్నారు. అయితే ఈ సమయంలో రద్దీ బాగా పెరిగింది. బస్సులన్నీ మహిళా ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి..

తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు, విద్యార్థినులు, యువతులు సద్వినియోగ పర్చుకుంటున్నారు. అయితే ఈ సమయంలో రద్దీ బాగా పెరిగింది. బస్సులన్నీ మహిళా ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు పర్చే పనిలో పడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే.. మహాలక్ష్మి పథకంపై తొలి సంతకాన్ని చేశారు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. కేవలం మహిళలే కాదూ విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్లు, యువతులు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో నివసిస్తున్నట్లు నిర్దారించే ఏదైనా గుర్తింపు కార్డుతో తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా జర్నీ చేయొచ్చు. దీంతో ఈ పథకానికి విశేషణ ఆదరణ లభించింది. మహిళలు, అమ్మాయిలు బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

ఈ పథకం అమలు అయిన నాటి నుండి బస్సులు మహిళలతో నిండిపోతున్నాయి. రద్దీ కూడా పెరిగిపోయింది. పలు మార్గాల్లో బస్సులు సరిపడటం లేదు. కొన్ని సార్లు ట్రాఫిక్ జాం కారణంగా సమయానికి బస్సులు కూడా రావడం లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ రూట్లలో బస్సులు వేయండని వినతులు వస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుండి ఈ రిక్వెస్టులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. దీంతో వెంటనే ఆర్టీసీ అద్దె బస్సులు కావాలని ప్రకటన చేశారు.

‘గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో గుర్తింపు పొందిన మార్గాల్లో టీఎస్ఆర్టీసీ నిర్వహణ కోసం అద్దె పథకం కింద మెట్రో ఎక్స్ ప్రెస్, సిటి ఆర్డినరీ, సిటీ సబర్బన్ బస్సుల సరఫరా కోసం ఎంటర్‌ప్రెన్యూయర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్గాల జాబితా, టెండర్ దరఖాస్తు రోజువారీ కిలోమీటర్లు, రెంటల్ రేటు, ఎంటర్ ప్రెన్యూయర్స్ ఎంపిక కోసం ప్రమాణాలు, కాషన్ డిపాజిట్, బస్సు మోడల్, కనీస వీల్ బేస్, సీటింగ్ సామర్థ్యం, సీటు నమూనా, రంగు, బస్సు బాడీ ప్రమాణాలు, అగ్రిమెంట్ వ్యవధి, టెండర్ నోటిఫికేషన్ షరతులు.. ఇతర నిబంధనలు, టెండర్ తేదీ, ఇతర వివరాలు టీఎస్ఆర్టీసీ వెబ్ సైట్‌లో చూడవచ్చునని, వీటిని 22 డిసెంబర్ 2023 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ లేదా 9100998230 నెంబర్‌లో సంప్రదించవచ్చునని సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది’. ఈ ప్రకటనను సజ్జనార్ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవలే ఈ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తుందని, కొత్త బస్సులను తీసుకు వస్తున్నాం అని సజ్జనార్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ యాడ్ దర్శనమిచ్చింది.

Show comments