iDreamPost

మొదలైన భారీ వర్షం.. అత్యవసరం అయితేనే బయటకు రండి..!

  • Author Soma Sekhar Published - 06:09 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 06:09 PM, Mon - 24 July 23
మొదలైన భారీ వర్షం.. అత్యవసరం అయితేనే బయటకు రండి..!

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రానున్న మరో మూడు రోజులు తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హెచ్చరికను జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికాసేపట్లో హైదరాబాద్ సిటీలో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయిని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే నగరంలో పలు చోట్ల భారీ వర్షం ప్రారంభం అయ్యింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది జీహెచ్ఎంసీ.

మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావొచ్చని అలర్ట్ చేసింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల మధ్యలో భారీ వర్షం పడే సూచన ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. దాంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బోరబండ, మాదాపూర్ లతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షం ప్రారంభం అయ్యింది. దాంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాగా.. ఖైరతాబాద్, పంజాగుట్ట, నిమ్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఇక నగరంలోని  కొండాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, అబిడ్స్, అంబర్ పేట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ లతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం దంచికొడుతోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండటంతో.. ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఈ మూడు రోజులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో.. ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి