హైదరాబాద్‌లో భారీ వర్షం! కమ్మేసిన చీకట్లు! బయటకి వస్తే డేంజర్!

Heavy Rains: వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. మిట్ట మధ్యాహ్నం చీకట్లు అలుముకున్నాయి. పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Heavy Rains: వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. మిట్ట మధ్యాహ్నం చీకట్లు అలుముకున్నాయి. పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

వర్షాలు పడితే చల్లగా ఉంటుందన్న పేరుకే గానీ రోడ్లన్నీ నీట మునిగిపోతాయి. దీని వల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పది కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు కూడా గంటల గంటలు ట్రాఫిక్ లో ఎదురుచూసే పరిస్థితి. ప్రస్తుతం మరోసారి హైదరాబాద్ లో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. మిట్ట మధ్యాహ్నం చీకట్లు అలుముకున్నాయి. ఒక్కసారిగా నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకూ ఉక్కబోత కలిగించిన వాతావరణం ఒక్కసారిగా కూల్ ఎక్కింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు ఆకాశాన్ని అలుముకున్నాయి.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగా దంచికొడుతుంది. ఈ సమయంలో బయటకు వస్తే అంతే సంగతులు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం పక్కా. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, లింగంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, ఎల్బీ నగర్, నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, బాలానగర్, కూకట్ పల్లి, దిల్ షుక్ నగర్, బోయినపల్లి ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది.

రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని.. పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్లు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇవాళ, రేపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Show comments