Dharani
ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో జోరు వాన కురుస్తుంది. ఈ క్రమంలో అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాఉల..
ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో జోరు వాన కురుస్తుంది. ఈ క్రమంలో అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాఉల..
Dharani
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆదివారం సాయంత్రం నుంచి నగరంలో కుండపోత వాన మొదలయ్యింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నగర వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రావద్దని సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తుంది. ఆదివారం నాడు హైదరాదబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో జోరు వాన కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. దానికి తగ్గట్టుగానే ఆదివారం సాయంత్ర 5 గంటల తర్వాత నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై.. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. వెంటనే నిమిషాల వ్యవధిలో కుండపోత వాన మొదలయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈక్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నేడు నగరంలో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం నుంచి బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్ పల్లి, లింగంపల్లి, బాల్ నగర్, చింతల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో కుండపోత వాన మొదలయ్యింది. రోడ్లపైకి వర్షం నీళ్లు చేరడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
అటు జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతోంది. ఈ క్రమంలో అధికారులు.. జనాలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని.. అలానే మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. చిన్న పిల్లలను బయటకు పంపవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలానే కరెంట్ స్థంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.