iDreamPost

బ్రేకింగ్ :హైదరాబాద్ లో భారీ వర్షం.. పిడుగుపాటుతో ముగ్గురు మృతి

Hyderabad Rain: వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం హఠాత్తుగా మారిపోయింది. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం (మే19) హైదరాబాద్ మధ్యాహ్నం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి.

Hyderabad Rain: వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం హఠాత్తుగా మారిపోయింది. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం (మే19) హైదరాబాద్ మధ్యాహ్నం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి.

బ్రేకింగ్ :హైదరాబాద్ లో భారీ వర్షం.. పిడుగుపాటుతో ముగ్గురు మృతి

మార్చి నెల నుంచి ఎండలు దంచి కొట్టాయి. ఏప్రిల్, మే మొదటి వారం ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటిపోయింది. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎండలకు భయపడి జనాలు బయటకు రావడం మానేశారు. మిట్ట మధ్యాహ్నం రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు చల్లని పానియాల వెంట పరుగులు తీస్తున్నారు. అలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో ఈరోజు ఉదయం మండిపోయే ఎండ.. మధ్యాహ్నం వరకు వాతావరణం చల్లబడిపోయింది. పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గ్రేటర్ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది.  కుత్బుల్లాపూర్, బాచుపల్లి, నిజాం పేట, బాలానగర్, బోయిన్ పల్లి, సనత్ నగర్ లో భారీ వర్షం పడుతుంది. కొన్నిచోట్ల రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మేయర్. మ్యాన్ హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. యాలాల మండలం జుంటుపల్లిలో పిడుగుపాటుతో మంగలి శ్రీనివాస్, కొన్నిటి లక్ష్మప్పతో పాటు మరొకరు చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

తెలంగాణలో రాగల 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతు పవనాలు ఈ రోజు మాల్దీవులు కొంతవరకు.. కొమరీన్ ప్రాంతంలో కొంతవరకు.. దక్షిణ బంగాళా ఖాతం, అండమాన్ నికోబార్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి