iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన జనం!

  • Published Jul 12, 2024 | 8:08 AM Updated Updated Jul 12, 2024 | 8:13 AM

Nampally Railway Station: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో తరుచూ తుపాకీ కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఎల్‌బీనగర్ రింగ్ రోడ్ సమీపంలో పార్థి ముఠాపై పాలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Nampally Railway Station: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో తరుచూ తుపాకీ కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఎల్‌బీనగర్ రింగ్ రోడ్ సమీపంలో పార్థి ముఠాపై పాలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బ్రేకింగ్: నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన జనం!

హైదరాబాద్ లో ఇటీవల కాలంలో కొంతమంది నేరగాళ్ళు తుపాకులతో రెచ్చిపోతున్నారు. డ్రగ్స్, సెటిల్ మెంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలోని వారు తుపాకీలో బెదిరింపులకు పాల్పపడుతు నానా హంగామా చేస్తున్నారు. బిహార్, ఛత్తీస్‌గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది దొంగలు తుపాకీలతో బెదిరిస్తూ దోపిడీకి పాల్పపడుతున్నారు. కొద్ది రోజులుగా సిటీలో తుపాకీ కాల్పులతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.  సికింద్రాబాద్ లో పోలీసులు కాల్పులు ఘటన మరువక ముందే నగరంలో మరోచోట పోలీసులు కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులకు కాల్పులు జరపడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. అసలేంద జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదారాబాద్ నాంపల్లిలో పోలీసులు కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే అందులోని ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పపడ్డాడు. దీంతో పోలీసులు తుపాకీతో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరికి గాయాలు కాగా మరో ఇద్దరు పరారయ్యారు. గాయపడ్డ వ్యక్తిని నీష్‌గా గుర్తించారు. గాయపడ్డవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల మోతతో అక్కడ ఉన్న కొంతమంది భయంతో పరుగులు పెట్టారు.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కాల్పులతో అనీష్, రాజ్ అనే వారిని అదుపులోకి తీసుకన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులపైకి దాడికి యత్నించడంతో అప్రమత్తమై కాల్పులు జరపాల్సి వచ్చిందని.. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయని చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడ్డవారు.. పారిపోయిన వారు డకాయిట్స్ గా భావిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.