P Krishna
Gruha Lakshmi Scheme: తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా రూ. 500లకు గ్యాస్ సిలిండర్ విషయంలో పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Gruha Lakshmi Scheme: తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా రూ. 500లకు గ్యాస్ సిలిండర్ విషయంలో పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
P Krishna
తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారు. ఈ పథకానికి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్ పై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్దిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలనే ఆలోచనతో పౌరసరఫరాల శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింత ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం కింద ఎంపికైన లబ్ది దారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్దతి అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ కింద లబ్దిదారులకు లభించే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఓఎంసీలకు అందిస్తే.. సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్దిదారులు డబ్బు మొత్తం చెల్లించిన తర్వాత సదరు ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. అంటే లబ్దిదారుడు గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955 గా ఉంది.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే మాత్రమే గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు దీనికి నిబంధనలతో కూడా మార్గదర్శకాలు ఖారారు చేశారు పౌరసరఫరా శాఖ. అర్హత గల కుటుంబం గత మూడేళ్లుగా వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. దీని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు లబ్దిదారులకు సబ్సిడీ ఇస్తారు. ఇటీవల ప్రజా పాలనలో దరఖాస్తులు, తెల్ల రేన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్దిదారులను గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందంచే రాయితీ చెల్లింపు విషయాలు ఎన్‌పీసీఐ ఫ్లాట్ ఫాంగా పనిచేస్తుంది. ఎస్‌బీఐ నోడల్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు పది లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు దాదాపు రూ.300 కు పైగా సబ్సిడీ అందిస్తుంది. వీరిని కూడా గృహలక్ష్మి పథకం కిందికి తీసకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.