iDreamPost
android-app
ios-app

80 ఏళ్ళ వయసులో వృద్ధ జంట పెళ్లి! 60 ఏళ్ళ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ!

వారిద్దరూ 60 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో వారికి పిల్లలు కూడా పుట్టారు. మనవళ్లు, మనవరాళ్లు కూడా వచ్చేశారు. ఇప్పుడు షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయస్సులో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

వారిద్దరూ 60 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో వారికి పిల్లలు కూడా పుట్టారు. మనవళ్లు, మనవరాళ్లు కూడా వచ్చేశారు. ఇప్పుడు షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయస్సులో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

80 ఏళ్ళ వయసులో వృద్ధ జంట పెళ్లి! 60 ఏళ్ళ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ!

ప్రేమకు, పెళ్లికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు కొంత మంది. ఇటీవల కాలంలో భర్త చనిపోయి, పిల్లల బాధ్యతలు తీరిపోయాక.. ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న చాలా మంది మహిళలు, మగవాళ్లు.. తోడు కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. పిల్లలే.. ఒంటరిగా బతుకుతున్న తల్లికి లేదా తండ్రికి మరో పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట మాత్రం కాస్త డిఫరెంట్. తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించుకునేందుకు ఈ జంటకు సుమారు 60 ఏళ్ల సమయం పట్టింది. ఇంత కాలం సహజీవనం చేసింది ఈ లవ్ కపుల్. ఎట్టకేలకు వృద్ధాప్య జంట వధూవరుల్లా ముస్తాబయ్యి.. చాన్నాళ్ల తమ కోరికను తీర్చుకుంది. వీరి పెళ్లిని ‘సహస్ర చంద్ర దర్శన వేడుక‘ పేరుతో ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు.

షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయస్సులో తమ ప్రేమను పండించుకుంది ఓ జంట. 80 ఏళ్ల వృద్దుడు.. 70 ఏళ్లున్న తన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. 60 ఏళ్ల పాటు సహజీవనం చేయగా.. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం ఈ పెళ్లికి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. జీవిత భాగస్వామిని పెళ్లి గెటప్‌లో చూసి మురిసిపోతున్నాడు ఈ కొత్త పెళ్లికొడుకు. మనస్సు పడ్డ మగవాడ్ని పెళ్లి చేసుకున్నానన్న ఆనందంలో ఉంది ఆమె. ఇంతకు ఈ వింత పెళ్లి ఎక్కడ జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లాలో. వివరాల్లోకి వెళితే.. సమిదా నాయక్ (80), గోగులోత్ లాలీ (70)దంపతులు ఇద్దరు గతంలో గంధర్వ వివాహం చేసుకున్నారు.

అంటే కేవలం దండలు మాత్రమే మార్చుకున్నారు. అప్పట్లో తాళి కట్టే ఆచారం లేకపోవడంతో..ఇలా పెళ్లి చేసుకున్నారు. అలా సహజీవనం చేస్తూనే.. నలుగురు కుమారులు, ఒక కుమార్తెను కన్నారు. వీరిని పెంచి, పెద్ద చేశారు. అలాగే వారికి పెళ్లిళ్లు చేశారు. వాళ్లకి పిల్లలు పుట్టారు. తాళి కట్టకపోయినా.. ఈ బంధం బలహీన పడలేదు. మరింత బలపడింది.  అయితే గోగులోత్ మెడలో మంగళ సూత్రం లేదని, తనకు మూడు ముళ్లు వేయలేకపోయానని బాధపడేవాడట సమిదా నాయక్. ఈ బాధను అర్థం చేసుకున్న కొడుకులు, కూతురు, మనవళ్లు, మనవరాళ్లు.. ఎట్టకేలకు ఈ నెల 28న పెళ్లి జరిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. తనతో 60 ఏళ్ల పాటు కాపురం చేసిన భార్యను మరోసారి మూడుముళ్లు వేసి పులకరించిపోయాడు సమిదా నాయక్.