P Krishna
Gram Panchayat General Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల పూర్తయిన తర్వాత వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది.
Gram Panchayat General Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల పూర్తయిన తర్వాత వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది.
P Krishna
గత ఏడాది చివర్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గత పదేళ్లుగా పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ కి చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ పథకాలకు ఆకర్షితులపై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంట పథకాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల హడావుడి నడుస్తుంది.. ఈ ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. మే 13న పోలింగ్.. జూన్ 04 న ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. అదే ఊపుతో వచ్చే స్థానిక ఎన్నికల్లో మరో ఘనవిజయం సాధించే అవకాశం ఉంటుందని పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని.. పూర్తిగా అభివృద్ది పనులపై దృష్టి కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. మే నెలలో మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ హాజరవుతారని తెలిపారు. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కష్టపడి మంచి ఫలితం వచ్చేలా చేయాలని.. పార్టీని గెలిపిస్తే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి.. కోడ్ ఎత్తివేయగానే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో వెల్లడించారు.
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన వివరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలూ ఉండవని.. పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు.. లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి, పార్టీని గెలిపిస్తే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. జూన్ 04న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా.. అదే వారంలో నోటిఫికేషన్.. జూన్ చివరినాటికల్లా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.మే నెలలో మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ హాజరవుతారని తెలిపారు.