P Krishna
Governor Tamilisai Cleaned Hanuman Temple: దేశంలో ఎంతో ప్రతిష్మాత్మకంగా ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు ప్రయాణమవుతున్నారు.
Governor Tamilisai Cleaned Hanuman Temple: దేశంలో ఎంతో ప్రతిష్మాత్మకంగా ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు ప్రయాణమవుతున్నారు.
P Krishna
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే విషయంపై చర్చ సాగుతుంది.. అదే అయోద్య రామమందిరంలోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. అయ్యోధ్యలో ఎన్నో ఏళ్లుగా రామ మందిరం నిర్మించాలని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అందరి పోరాట ఫలితం.. అయోద్యలో రామ మందిరం నిర్మాణం అవుతుంది. జనవరి 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని ఆలయాలు సిద్దం కావాలని మోదీ పిలుపునిచ్చారు.. అందేకాదు దేశంలోని ఆలయాలను స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలోని దేవాలయాలను శుభ్రం చేస్తునున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశంలోని పలు దేవాలయాలను ప్రముఖులు స్వచ్ఛందంగా శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 12న మహారాష్ట్రలోని నాసిక్ పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీ కాలరామ్ ఆలయాన్ని శుభ్రం చేసిన విషయం తెలిసందే. ఈ మధ్యనే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంజీ గౌతమ్ గంభీర్ కరోల్ బాగ్ లోని శివ్ మందిర్ ని స్వయంగా శుభ్రం చేశారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్.. ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాఫ్ ఆలయ ప్రాంగణం శుభ్రం చేశారు. అనంతరం సీతారాములను సందర్భించుకున్నారు. అక్కడే ఉన్న నవగ్రహలకు ప్రదక్షణ చేశారు.
ఈ నెల 22 న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా దేవాలయాలను శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. మొత్తానికి అయోద్యలో జనవరి 22 ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని భక్తులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Telangana Governor Tamilisai Sounderrajan participated in Khairatabad Sri Hanuman Temple Swachhta Abhiyan today. She also offered prayers here.
(Pictures: Raj Bhavan PRO) pic.twitter.com/eAMNUgx9b4
— ANI (@ANI) January 20, 2024