గ్యాస్ వినియోదారులకు గుడ్ న్యూస్.. ఇకపై..

Minister Uttam Kumar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. పదవీ ప్రమాణం చేసిన రోజు తొలి సంతకం ఆరు గ్యారంటీ పథకాలపై చేశారు.

Minister Uttam Kumar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. పదవీ ప్రమాణం చేసిన రోజు తొలి సంతకం ఆరు గ్యారంటీ పథకాలపై చేశారు.

తెలంగాణలో గత ఏడాది చివర్లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతోో ప్రజల్లోకి వెళ్లింది. ఆ పథకాలపై నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ పథకాలు కూడా ప్రారంభించారు. త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే రూ.500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తుంది.అయితే ఈ పథకంలో ముందుగా గ్యాస్ సిలిండర్ కు పూర్తి నగదు చెల్లిస్తే.. ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు లబ్దిదారులకు ఖాతాల్లో జమ చేస్తుంది. కాకపోతే సబ్సిడీ పైసలు ఎప్పుడు పడుతున్నాయన్నది క్లారిటీ లేకపోవడంతో అయోమయానికి గరవుతున్నారు. కొంతమందికి నెల రోజులు దాటినా డబ్బు ఖాతాల్లో జమకావడం లేదు. మరికొంతమంది సబ్సిడీ డబ్బులే రాకపోవడంతో తము అర్హులం కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.500 కు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అంశంపై సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో చర్చించారు. వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ పైసలు జమ కావడంతో పాటు మొబైల్ మేసెజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పలు అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేధిక అందించాలని అధికారులను ఆదేశించారు.

Show comments