iDreamPost
android-app
ios-app

విద్యార్థులు- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు సెలవు

ఆగస్టు నెల మొదలైందంటే శ్రావణ మాసం, పండుగలు, పబ్బాలు మొదలౌతుంటాయి. మరో వైపు వానలు ముంచెత్తుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని అఫీషియల్.. మరికొన్ని అన్ అఫీషియల్ హాలీడేస్ వస్తాయి. అలాగే సోమవారం కూడా సెలవు రానుంది.

ఆగస్టు నెల మొదలైందంటే శ్రావణ మాసం, పండుగలు, పబ్బాలు మొదలౌతుంటాయి. మరో వైపు వానలు ముంచెత్తుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని అఫీషియల్.. మరికొన్ని అన్ అఫీషియల్ హాలీడేస్ వస్తాయి. అలాగే సోమవారం కూడా సెలవు రానుంది.

విద్యార్థులు- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు సెలవు

ఈ నెలలో విద్యార్థులకు వరుస సెలవుల రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 15 మొదలుకుని 19 వరకు వరుస సెలవులు వచ్చాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న వరలక్ష్మీ వ్రతం సెలవులు రాగా, శనివారం స్కూల్స్ కు వెళ్లారు. మళ్లీ ఆదివారం హాలీడే  రాగా, సోమవారం రాఖీ పూర్ణిమ సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో నాలుగు రోజుల పాటు పండుగ చేసుకున్నారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు శనివారం లీవ్ తీసుకుని.. ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు  25, 26 వరుసగా విద్యార్థులకు హాలీడేస్ రానున్నాయి. ఆగస్టు 26న సెలవు దినంగా ప్రకటించాయి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు.

ఏపీ, తెలంగాణ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇరు రాష్ట్రాల్లో ఆగస్టు 26న హాలీడే రానుంది. ఈ సోమవారం.. కృష్ణాష్టమి సందర్బంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాయి. దీంతో సోమవారం నాడు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. దీంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చినట్లయ్యింది. ఆదివారం ఆట పాటల్లో మునిగి తేలినా.. సోమవారం కూడా సెలవును ఎంజాయ్ చేయోచ్చు స్టూడెంట్స్. ఒకసారే ఫ్యామిలీ అంతా టైమ్ స్పెండ్ చేసే సమయం దొరికినట్లయ్యింది. ఆగస్టు నెల మొదలైందంటే శ్రావణ మాసం, పండుగలు, పబ్బాలు మొదలౌతుంటాయి. మరో వైపు వానలు ముంచెత్తుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని అఫీషియల్.. మరికొన్ని అన్ అఫీషియల్ హాలీడేస్ వస్తాయి.

tomorrow holiday

హిందూ ఇతిహాసాల ప్రకారం.. శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు. ఆయన జన్మించిన రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ కృష్ణాష్టమినే గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో విరివిగా లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. రేపు శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇప్పటికే కృష్ణుడి దేవాలయాల్లో పండుగ వాతావరణం మొదలైంది. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి.