Arjun Suravaram
Hyderabad Metro: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓ కీలక విషయాన్ని మెట్రో అధికారులు ప్రకటించారు.
Hyderabad Metro: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓ కీలక విషయాన్ని మెట్రో అధికారులు ప్రకటించారు.
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సందర్భంగా చాలా మంది పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తుంటారు. ఇదే సమయంలో గ్రామాల నుంచి కూడా పట్టణానికి వస్తుంటారు. సంక్రాంతి సెలవులను పట్టణంలో గడపాలని చాలా మంది నగర బాట పడుతుంటారు. ఇదే సమయంలో వివిధ సంస్థలు, కంపెనీలు అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. నగరాల్లో ప్రజలు ఎంజాయ్ చేసేందుకు అనేక రకాల ఆఫర్లను,రాయితీలను ప్రకటిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో సంస్థ కూడా.. నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని కారణంగా నగర వాసుల సమయం ఎంతో వృథా అవుతోంది. అంతేకాక కిక్కిరిసిన జనాలతో, భారీ ట్రాఫిక్ తో చాలా మంది చికాకు, అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చేందే వచ్చింది. మెట్రో రైళ్లు. ఇది ప్రారంభం కావడంతో నగరంలోని ఒక చివరి నుంచి మరో చివరికి అతి తక్కువ సమయంలోనే చేరుకుంటున్నారు. ఇక మెట్రో సంస్థ కూడా ప్రయాణికుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలోఉంచుకుని అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అలానే ప్రత్యేక సందర్భాల్లో, పండగల వేళ మెట్రో ప్రయాణికులకు రాయితీలు, ఇతర ఆఫర్లు అందిస్తుంటారు అధికారులు. గతంలో క్రికెట్ మ్యాచ్, న్యూయర్ వేళ రైళ్ల సమయం పెంచడం, అదనపు రైళ్లను కేటాయించడం చేశారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా మెట్రో రైలు అధికారులు మరో గుడ్ న్యూస్ చెప్పారు
హైదరాబాద్ మెట్రోలో నేటి నుంచి 3 రోజుల అన్ లిమిటెడ్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్రో కార్డు ఉన్నవారు రూ.59 రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని పొందొచ్చు. జనవరి 13,14,15 తేదీల్లో మెట్రో హాలిడే కార్డు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే రోజంతా ట్రైన్ లో ప్రయాణించవచ్చు. ఈ మంచి అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా కాలం నుంచి ఈ ఆఫర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ఆఫర్ ను అధికారులు విడుదల చేస్తున్నారు. మరి.. సంక్రాంతి సందర్భంగా నగర వాసులకు అధికారులు చెప్పిన ఈ గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.