P Krishna
Good News for Metro Commuters: హైదరాబాద్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 2017 లో మెట్రో సర్వీస్ ప్రారంభించారు. వేగంగా, సౌకర్యవంతమైన ప్రయాణం కావడంతో చాలా మంది మెట్రోలో ప్రయాణించడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
Good News for Metro Commuters: హైదరాబాద్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 2017 లో మెట్రో సర్వీస్ ప్రారంభించారు. వేగంగా, సౌకర్యవంతమైన ప్రయాణం కావడంతో చాలా మంది మెట్రోలో ప్రయాణించడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
P Krishna
హైదరాబాద్ మహానగరంలో జనాబా రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. నాన్ లోకల్ మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదేరువు కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. దీంతో ప్రయాణాలు రద్దీగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ప్రజలకు ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసేందుకు మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. 2017లో నాగోల్-అమీర్పేట్-మియాపూర్ మార్గంతో ఈ సేవలు ప్రారంభించపడ్డాయి. దీంతో ప్రజలకు చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో మెట్రోలో ప్రతిరోజూ లక్ష మంది వరకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ సంస్థ. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో ఇటీవల ట్రాఫిక్ ఇబ్బందులు మరీ ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాల నిమిత్తం నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు. నాటి నుంచి ట్రాఫిక్ కు మెట్రో ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. వేగవంతం, సౌకర్యవంతం ప్రయాణం కావడంతో చాలా మంది మెట్రోలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అయితే ఉదయం 7 గంటల నంచి 11 గంటల వరకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. తెల్లవారు జామున ప్రయాణం చేసేవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మెట్రో ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో సంస్థ. దీని వల్ల చాలా మంది ప్రయాణికులకు మంచి చేకూరుతుందని సంస్థ అభిప్రాయపడుతుంది.
ఇక నుంచి ఉదయం 5.30 గంటల నుంచి మెట్రోను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తెల్లవారు జామున షిఫ్టుల్లో ఉద్యోగాలు చేసేవారు, చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికు ఉదయం 5.30 గంటలకు గత శుక్రవారం ప్రయోగాత్మకంగా రైళ్లు నడపగా.. మంచి స్పందన వచ్చింది. దీంతో ఇక నుంచి 5.30 గంటలకే మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేదుకు సిద్దమైంది. ప్రయాణికు బాగోగులే తమకు ముఖ్యమని.. ట్రాఫిక్ రద్దీ కూడా బాగా తగ్గుతుందని తెలిపారు. గత కొంత కాలంగా ప్రయాణికుల నుంచి దీనిపై విజ్ఞప్తులు వస్తున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది.