నేడు రైతుల అకౌంట్‌లో డబ్బు జమ.. అదొక్కటి ఉంటే చాలు!

నేడు రైతుల అకౌంట్‌లో డబ్బు జమ.. అదొక్కటి ఉంటే చాలు!

Good News for Telangana Farmers: తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు, మెనిఫెస్టో అమలు పరిచేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే రైతులకు గుడ్ న్యూస్..నేడే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల.

Good News for Telangana Farmers: తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు, మెనిఫెస్టో అమలు పరిచేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే రైతులకు గుడ్ న్యూస్..నేడే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల.

తెంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల అమలు విషయంలో పలు హామీలు నిలబెట్టుకుంది. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 ఉచిత కరెంట్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేస్తుంది. ప్రజా పాలన కార్యక్రం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ విషయంపై ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఈ నెల 19న మొదటి విడత పూర్తయ్యింది. నేడు రెండో విడత నిధులు విడుదల చేయబోతున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రైతులకు గొప్ప శుభవార్త.. నేడు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ప్రారంభం కానుంది. లక్షన్నర రూపాయల వరకు రుణ మాఫీనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. తెలంగాణలో గత ఏడాది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 19న మొదటి విడత ప్రారంభించింది. రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6 వేల 98 కోట్లను ప్రభుత్వం జమచేసింది. నేడు మంగళవారం (జులై 30) రెండో విడతలో బాగంగా లక్షన్నర వరకు రుణ మాఫీ నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగస్టు లోపు రుణమాఫీ చేయాలన్న సవాల్ ని స్వీకరించి సీఏం ఆ మాట నిలబెట్టుంటున్నారు. మొదటి విడత లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. అయితే ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో సుమారు 17వేల మందికి రుణమాఫీ డబ్బు జమకాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేసి మూడు విడతల్లో రూ.31 వేల కోట్లను రైతుల ఖాతాల్లో ఆగస్టు 15వ తేదీలోపు జమచేస్తామన్నారు.ఇక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నేడు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.. ఒక్కసారి చెక్ చేసుకోవాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితో సంబంధిత అధికారులను సంప్రదించాల్సిందిగా కోరారు. పిర్యాదులు అందిన 30 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.ఇందుకు సంబంధింత ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులకు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Show comments