iDreamPost
android-app
ios-app

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అద్భుత దృశ్యం!తవ్వకాలు జరిపి చూస్తే..

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ అరుదైన దృశ్యం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ కి కనిపించిన అదృశ్య శక్తి.. అతడి గ్రామంలో పండగ వాతావరణం వచ్చేలా కారణమైంది. మరి.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ అరుదైన దృశ్యం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ కి కనిపించిన అదృశ్య శక్తి.. అతడి గ్రామంలో పండగ వాతావరణం వచ్చేలా కారణమైంది. మరి.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అద్భుత దృశ్యం!తవ్వకాలు జరిపి చూస్తే..

ఈ భూ మండలంలో అనేక వింత, విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే వాటిల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మనదాక చేరుతుంటాయి. ముఖ్యంగా దేవుళ్లకు సంబంధించిన అనేక వార్తలు మనకు తరచూ కనిపిస్తుంటాయి. దేవాలయాల్లో నిధులు, సర్పాలు తిరగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. అలానే కొందరికి దేవుడు కలలో వచ్చాడంటూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతుంటారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కి ఓ అదృశ్య శక్తి కనిపించింది. సీన్ కట్ చేస్తే.. ఆ ఊరిలో పండగ వాతావరణం ఏర్పడింది. మరి.. ఏం జరిగింది?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం అదే గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పిన మాటలు. శ్రీనివాస్ స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవననం సాగిస్తున్నాడు. ఆటో నడపడం ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం ఉదయం వెళ్లి..రాత్రి చీకటి పడిన తరువాత ఇంటికి వస్తుండే వాడు. అలానే ఒక రోజు రాత్రి తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలు దేరాడు.  గ్రామ సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన ఉన్న పొదలో దేవుడు కనిపించినట్లు అనిపించింది. మరుసటి రోజు తనకు కనిపించిన అద్భుత దృశ్యం గురించి గ్రామస్తులకు శ్రీనివాస్ తెలిపాడు.

అయితే అతడి గ్రామస్తులు  ఎవరూ నమ్మక లేదు. దీంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో తనకు అదృశ్య శక్తి కనిపించిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ముక్కోటి ఏకాదశి రోజున కొంత మేర తవ్వకాలు చేపట్టి వదిలివేశారు. ఇక అప్పటి నుంచి గ్రామంలో జరిగే శుభకార్యాల్లో మహిళలకి పూనం వచ్చేది. అలా ఉగ్రరూపంలో ఉన్న మహిళ రూపంలో నేను అక్కడే ఉన్నానంటూ నన్ను ఎవరు గుర్తించడం లేదని  చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా చర్చించుకుని తవ్వకాలు జరిపేందుకు ముహూర్తం పెట్టారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కు దేవుని రూపం కనిపించిన ఆ ప్రాంతంలో పూజారితో పూజలు నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతంలో మెల్లగా జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టారు.

అలా దాదాపు 12 అడుగుల మేర తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఓ బండరాయిపై మీసాల లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆకృతులు కనిపించాయి. దీంతో పూజారులు రూపాలకు పూజలు నిర్వహించారు. ఇక ఇలా దేవుడి రూపాలు బయటపడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. స్వామి వెలిశాడనే నమ్మకంతో గ్రామస్తులు పూజలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతమంత పండగ వాతావరణం నెలకొంది. ఇలా ఓ ఆటో డ్రైవర్ కి కనిపించిన అదృశ్య శక్తి.. చివరకు  ఆగ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.