iDreamPost
android-app
ios-app

కిలేడీలు: డబ్బున్న వాళ్లే టార్గెట్‌.. పబ్‌కి పిలిచి..! ఆపై..

టిండర్ యాప్ లో యువకులను ట్రాప్ చేసి మోసం చేస్తున్న యువతుల  ఘటనలు అనేకం బయటపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మోసం బయటపడింది.

టిండర్ యాప్ లో యువకులను ట్రాప్ చేసి మోసం చేస్తున్న యువతుల  ఘటనలు అనేకం బయటపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మోసం బయటపడింది.

కిలేడీలు: డబ్బున్న వాళ్లే టార్గెట్‌.. పబ్‌కి పిలిచి..! ఆపై..

నేటికాలంలో అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. కొందరు దొంగతనాలు చేస్తుంటే..మరికొందరు మాయ మాటలు చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు. అలానే మరికొందరు అమ్మాయిలు, యువతులతో డబ్బున్న వారిని ట్రాప్ చేసి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందు కోసం అనేక రకాల యాప్ లను వినియోగిస్తున్నారు. పలు డేటింగ్ యాప్ ద్వారా మగవారిని ట్రాప్ చేసి.. అందినకాడికి దొచుకుంటున్నారు కిలాడిలు. నిత్యం ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నా..తాజాగా మరో ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

టిండర్ యాప్ లో యువకులను ట్రాప్ చేసి మోసం చేస్తున్న యువతుల  ఘటనలు అనేకం బయటపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మోసం బయటపడింది. మోష్ అనే పబ్ డబ్బున్న వారికి అమ్మాయిలను ఎరగ వేస్తున్నట్లు తెలిసింది. మోసపోయిన బాధితుడే.. ఈ విషయాలను వెల్లడించాడు. ఇక బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో కొందరు పబ్బు యజమానులు,  అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే హైటెక్  సిటీలో చోటుచేసుకుంది. డబ్బున్న యువకులను మాయమాటలతో బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు  పబ్ నిర్వాహకులు, యువతులు. టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా యువకులను పరిచయం చేసుకుని.. పబ్ లో కలుద్దామని పిలుస్తారు.

తాజాగా  ఓ యువతి..తనను రితికగా ఓ యువకుడిని డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకుంది. పబ్ లో కలుద్దామంటూ ఇన్వైట్ చేసింది. ఇక అమ్మాయి పిలవడంతో సదరు యువకుడు సైతం పబ్ కి వెళ్లాడు. అలా పబ్ కి తీసుకువెళ్లిన తరువాత రితికా అనే యువతి లిక్కర్ ఆర్డర్ చేసింది. కాసేపటి తరువాత రూ. 45 వేల బిల్లను చేతిలో పెట్టి చల్లగా జారుకుంది ఆ ఖిలాడీ. దీంతో బిల్లును చూసి ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ గురయ్యాడు యువకుడు. పబ్బు నిర్వాహకులు, యువతి కలిసి తనను మోసం చేశారని యువకుడు గ్రహించాడు. లిక్కర్ పేరుతో యువతికి కోక్ తాగించ్చి రూ.45 వేల బిల్ వేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

కేవలం తాను ఒక్కడినే కాదని ఇలా చాలా మంది మోసపోయారని యువకుడు గుర్తించాడు. పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపాడు. తనకు జరిగిన మోసం పైన యువకుడు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా బయటపెట్టాడు.  డబ్బులు కట్టకపోతే పబ్ యజమానులు బలవంతంగా బాధితులను బెదిరించి డబ్బులు కట్టించుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే.. ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.