iDreamPost
android-app
ios-app

మృత్యువుతో పోరాడి ‘పది’లో విజయం సాధించింది!

  • Published May 02, 2024 | 8:05 AM Updated Updated May 02, 2024 | 8:05 AM

Hyderabad: చదువు కోవాలనే పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించి తాము అనుకున్నది సాధిస్తారు. అలా ఎంతోమంది విద్యార్థులు ఇటీవల విడుదలపై ఫలితాల్లో రుజువు చేశారు.

Hyderabad: చదువు కోవాలనే పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించి తాము అనుకున్నది సాధిస్తారు. అలా ఎంతోమంది విద్యార్థులు ఇటీవల విడుదలపై ఫలితాల్లో రుజువు చేశారు.

మృత్యువుతో పోరాడి ‘పది’లో విజయం సాధించింది!

నేటి సమాజంలో ఉన్నత విద్యనభ్యసించిన వారికి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. గొప్ప జీవితం గడుపుతారని తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తున్నారు. తమ తాహతకు మించిన పరిస్థితి ఉన్నా.. పిల్లల భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. కొంతమంది విద్యార్థులకు చదువుకోవాలనే కోరిక ఎంతో ఉన్నా.. పేదరికం, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండ పట్టుదలతో తాము అనుకున్నది సాధించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. నాంపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. మృత్యువుతో పోరాడుతూనే తాను అనుకున్నది సాధించింది. వివరాల్లోకి వెళితే..

ఓ విద్యార్థిని ఒక వైపు మ‌ర‌ణంతో పోరాటం చేస్తూనే పట్టుదలతో టెన్త్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా అబిడ్స్ స్లేట్ ది స్కూల్ లో టెన్త్ చదువుతుంది. మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి తన తల్లి అస్మిత్ కౌర్ తో కలిసి స్కూటీపై వెళ్తుంది. అంతలోనే ఓ యువకుడు అడ్డు రావడంతో అదుపు తప్పి కిందపడిపోయారు. కిర్పాన్ కౌర్ కంటికి, పెదవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తల్లీకూతురిని స్థానిక కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కిర్ఫాన్ కౌర్ కి ఎంఆర్ఐ చేయగా తలలో రెండు చోట్ల రక్తం గడ్డ కట్టుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటిలేటర్ పై ఆమెకు చికిత్స అందించారు. నాలుగు రోజుల తర్వాత కిర్ఫాన్ కొద్దిగా కోలుకుంది. ఆమెను కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

టెన్త్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల కిర్ఫాన్ తాను పరీక్షలు రాయాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు కొంత కాలం విశ్రాంతి తీసుకొని జూన్ లో పది పరీక్షలు రాయొచ్చు అని సలహా ఇచ్చారు. కానీ కిర్ఫాన్ జూన్ లో రాస్తే సర్టిఫికెట్స్ పై సప్లిమెంటరీ కిందకు వస్తుంది.. అది తనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులు, పాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించి పరిస్థితి వివరించారు. వారి సంరక్షణ.. ప్రోత్సాహంతో ఇర్ఫాన్ టెన్త్ పరీక్షలు రాసింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 8.7 జీపీఏ సాధించింది. ఈ సందర్భంగా కిర్ఫాన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని.. అయినా కూడా చదువుకోవాలనే పట్టుదల తనలో ఉండటం వల్ల ఎగ్జామ్స్ రాయించాం. మొత్తానికి తాను అనుకున్నది సాధించి మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమ కూతురుని ప్రోత్సహించిన వైద్యులు, స్కూల్ ప్రిన్సిపల్ కి కృతజ్ఞతలు తెలిపారు.