P Venkatesh
రాను రాను మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి బ్రతికుండగానే మట్టిలో పాతి పెట్టి కర్కశంగా ప్రవర్తించారు. ఈ ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది.
రాను రాను మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి బ్రతికుండగానే మట్టిలో పాతి పెట్టి కర్కశంగా ప్రవర్తించారు. ఈ ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది.
P Venkatesh
సృష్టికి మూలం ఆడబిడ్డ. అలాంటి బిడ్డను పురిటిలోనే కడతేరుస్తున్నారు కొందరు వ్యక్తులు. నేటి రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ ఆడపిల్లలంటే ఇంకా చూలకనగానే చూస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా కొడుకు, కూతురు సమానమే అనే విషయాన్ని తెలుసుకోకుండా కొందరు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. సంతానం లేక కొంతమంది ఏడుస్తుంటే.. మరికొంతమందేమో తమకు కలిగిన సంతానాన్ని చేజేతులా చంపుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని బ్రతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.
మనుషుల్లో మావత్వం మంటగలిసిందనడానికి ఇదొక్క సంఘటన చాలు. ఆడపిల్ల పుట్టగానే చంపేందుకు సిద్ధమయ్యారు. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ లారీ డ్రైవర్ రోడ్డు పక్కన తన వాహనాన్ని నిలిపాడు. ఆసమయంలో ఆ పక్కనే భూమిలోంచి ఏదో కదులుతున్నట్లుగా గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్లి మట్టిని తవ్వాడు. దీంతో ఒక్కసారిగా అతడు షాక్ కు గురయ్యాడు. ఆ మట్టిలో కొద్దిసేపటి క్రితమే పుట్టిన పసికందు కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆ ఆడిపిల్లను బయటికి తీశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న ఎస్సై అక్కడికి చేరుకొని, హుటాహుటిన పాపను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పాపను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తెలపారు. ఇక ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లగా పుట్టడమే తప్పై పోయిందా? పాపను చంపే రైట్ ఎవరిచ్చారు అంటూ మండిపడుతున్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం.. బ్రతకనిద్దాం.. ఎదగనిద్దాం అంటూ ఆడపిల్లలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.