Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ సమస్యకు చెక్‌

హైదరాబాద్‌ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది. వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యకు చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది. వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యకు చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

మన భాగ్యనగరంలోనే కాక.. పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్‌, పార్కింగ్‌. ఇక మన హైదరాబాద్‌లో అయితే నాలుగు చినుకులు పడితే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. 5 కిలోమీటర్ల దూరమైనా సరే.. వెళ్లడానికి సుమారు గంట సమయం పడుతుంది. ఇక నేటి కాలంలో వాహనాలు వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటికో వాహనం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. చాలా మందికి కార్లు, బైక్‌లు రెండు వాహనాలు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక కొందరు వెహికల్‌ కొనుక్కుందాం అనుకున్నా.. పార్కింగ్‌ స్పేస్‌ అతి పెద్ద సమస్యగా మారింది. దాంతో చాలా మంది వాహనాలు కొనగోలు చేయడానికి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాహనదారులకు శుభవార్త.. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం వినూత్న ఆలోచన చేశారు. ఆ వివరాలు..

సిటీలో ట్రాఫిక్, వెహికల్ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్కింగ్ స్థలం కొరతను తీర్చేందుకు రద్దీ ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్క్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్లు, బైక్‌లు పార్కింగ్ చేయడానికి మల్టీలెవల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి రెడీ అయ్యారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఈ బిల్డింగ్‌ మొత్తం స్థలంలో 20 శాతం బైక్‌ పార్కింగ్ కోసం కేటాయించారు. మిగతా స్థలాన్ని కార్ల పార్కింగ్‌ కోసం కేటాయించనున్నారు.

ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మల్టీ లెవల్ పార్కింగ్ బిల్డింగ్‌ను తెరిచి ఉంచుతారు. పార్కింగ్ చేసే దగ్గర సీసీ కెమెరాలు, లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఇప్పటికే నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కూడా ఇలాంటి మల్టీ లెవల్ పార్కింగ్ బిల్డింగ్‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ 10 అంతస్తుల బిల్డింగ్‌లో ఐదు బిజినెస్‌ యాక్టివిటీస్‌కు మరో ఐదు మల్టీ లెవల్ పార్కింగ్, షాపింగ్ మాల్స్‌కు కేటాయించనున్నారు. త్వరలోనే ప్రభుత్వం దీన్ని ఓపెన్‌ చేయనుంది. ఇక నగరంలో ఇలాంటి బిల్డింగ్‌లను ఎక్కువ మొత్తంలో నిర్మిస్తే పార్కింగ్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments