iDreamPost
android-app
ios-app

కొత్త నిబంధనలు.. RTO టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్! ఎలా పొందొచ్చంటే?

వాహనదారులు లైసెన్స్ పొందాలంటే ఇకపై ఆర్టీవో ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు. టెస్టు కూడా అవసరం లేదు. కొత్త నిబంధనల ప్రకారం సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. ఆ వివరాలు మీకోసం..

వాహనదారులు లైసెన్స్ పొందాలంటే ఇకపై ఆర్టీవో ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు. టెస్టు కూడా అవసరం లేదు. కొత్త నిబంధనల ప్రకారం సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. ఆ వివరాలు మీకోసం..

కొత్త నిబంధనలు.. RTO టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్! ఎలా పొందొచ్చంటే?

వాహనదారులకు గడ్ న్యూస్. రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో నిబంధనలను సరళతరం చేసింది. ఏకంగా రీజినల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసులకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ పొందే అవకాశాన్ని కల్పించింది. కాగా టూ వీలర్ నుంచి మొదలుకుని త్రీ, ఫోర్ ఇంకా ఇతర హెవీ వెహికిల్స్ అన్నింటిని నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే చట్టరీత్యా నేరం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్షకూడా విధిస్తారు. కాబట్టి వాహన ఛోదకులు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. ఇంతకీ ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందొచ్చు. ఏ విధంగా లైసెన్స్ జారీ చేస్తారు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్టీవో ఆఫీసులకు వెళ్లి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీవో నిబంధనల ప్రకారం అధికారులు పలు టెస్టులు నిర్వహించి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఆ తరువాత పర్మినెంట్ లైసెన్స్ అందిస్తారు. కానీ తాజా నిబంధనలకు ప్రకారం ఆర్టీవో ఆఫీసులతో పనిలేకుండా లైసెన్స్ పొందొచ్చు. గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందొచ్చు. డ్రైవింగ్ శిక్ష‌ణ పొందిన వారికి అక్రిడిటేడ్ డ్రైవ‌ర్ ట్రైనింగ్ సెంట‌ర్లు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయ‌ని కేంద్ర జాతీయ ర‌హ‌దారుల‌, ర‌వాణాశాఖ మంత్రిత్వ‌శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంట‌ర్లను కేంద్ర‌, రాష్ట్ర ర‌వాణా శాఖ‌లు నిర్వ‌హిస్తుంటాయి.

అక్రిడిటేడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంట‌ర్ల వ‌ద్ద డ్రైవింగ్ లైసెన్స్ పొందాడానికి.. ఆయా సంస్థ‌ల వ‌ద్ద డ్రైవింగ్ శిక్ష‌ణ కోసం లైసెన్స్ కావాల్సిన వారు పేరు న‌మోదు చేసుకోవాలి. డ్రైవింగ్ ట్రైనింగ్‌, ట్రాఫిక్ నియమ నిబంధనలు రోడ్ సేఫ్టీ మెజర్ మెంట్స్ అన్నింటిలో శిక్షణ ఇస్తారు. ఆ తరువాత ప‌రీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్ పాసైన త‌ర్వాత సంబంధిత అభ్య‌ర్థుల‌కు ఆయా ట్రైనింగ్ సెంట‌ర్లు స‌ర్టిఫికెట్లు జారీ చేస్తాయి. ఆ తరువాత శిక్ష‌ణ పొందిన వ్య‌క్తులు ట్రైనింగ్ స‌ర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని లైసెన్స్ పొందొచ్చు.

కాగా డ్రైవింగ్ ట్రైనింగ్ కేంద్రాలు.. స్టిమ్యులేట‌ర్లు, డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్‌ల‌ను క‌లిగి ఉండాలి. లైట్ మోటార్ వెహిక‌ల్స్, మీడియం, హెవీ వెహిక‌ల్స్ డ్రైవింగ్‌లో స‌ద‌రు అక్రిడేటెడ్ డ్రైవ‌ర్ ట్రైనింగ్ సెంట‌ర్లు శిక్ష‌ణ ఇస్తాయి. లైట్ మోటార్ వెహిక‌ల్స్ డ్రైవింగ్ శిక్ష‌ణ 29 గంట‌ల పాటు ఉంటుంది. కోర్స్ ప్రారంభించిన నాలుగు వారాల్లో శిక్ష‌ణ పూర్తి కావాలి. ట్రైనింగ్ సెంట‌ర్లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన అభ్య‌ర్థుల‌కు థియ‌రీ, ప్రాక్టిక‌ల్ నాలెడ్జ్ అందించాలి. ఈ కేంద్రం జారీ చేసిన ఈ కొత్త నిబంధనలతో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సులువుగా మారింది.