iDreamPost

బ్రేకింగ్: గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు.. వీడియో వైరల్

సాధారణంగా గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు రోడ్డు మరమ్మతు పనులు జరిగే సమయంలో పైప్ లీకేజీ జరిగి మంటలు ఎగసిపడుతుంటాయి.

సాధారణంగా గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు రోడ్డు మరమ్మతు పనులు జరిగే సమయంలో పైప్ లీకేజీ జరిగి మంటలు ఎగసిపడుతుంటాయి.

బ్రేకింగ్: గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు.. వీడియో వైరల్

ఇటీవల ప్రమాదాలు ఏ క్షణంలో ముంచుకు వస్తాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. సాధారణంగా గ్యాస్ పైప్ లైన్ లో లీకేజీ జరగడం వల్ల మంటలు ఎగసి పడుతుంటాయి. కొన్నిసార్లు జనావాసాల్లో గ్యాస్ పైప్ లీక్ అయితే ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. కొన్నిసార్లు ఊహించని రీతిలో భారీ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పడం వల్ల ప్రమాదాలు తప్పిపోతుంటాయి. తాజాజా కుత్బుల్లాపూర్ లోని కొంపల్లి, సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రధాన రహదారి కావడంతో ఎక్కువ జనసంచారం ఉంటుంది. మంటలు చూసి అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హైదరాబాద్ లోని కొంపల్లిలో గ్యాస్ పైప్ లైన లీకేజీ కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. దీంతో అటుగా ప్రయాణిస్తున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన కొంపల్లి- సుచిత్ర ప్రధాన రహదారిపై జరిగింది. ప్రధాన రహదారి కావడం.. ఎలాంటి సంఘటన జరగకుండా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడటంతో ప్రజలు ఆందోళన చెందారు.. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి ఎదురుగా ఉన్న కొంతమంది షాపు యజమానులు వారి దుఖాణాల్లోకి మంటలు వ్యాపిస్తాయన్న భయంతో వెంటనే మూసివేశారు. ప్రస్తుతం మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి.

హఠాత్తుగా కొంపల్లి-సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లీక్ కావడం.. మంటలు చెలరేగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగర్ గ్యాస్ సరఫరా పైప్ లీక్ అయినట్లు స్థానికులు అనుకుంటున్నారు.. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయి. రోడ్డు పక్కన తవ్వకాలు జరిపిన నేపథ్యంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యిందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నదాని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి