iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: హైదరాబాద్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు.. ఆరుగురి పరిస్థితి విషమం!

  • Published Dec 14, 2023 | 2:27 PM Updated Updated Dec 14, 2023 | 2:47 PM

ఇటీవల హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ ఉంచాలని చెప్పినా.. కొంతమంది వ్యాపారులు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ ఉంచాలని చెప్పినా.. కొంతమంది వ్యాపారులు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

బ్రేకింగ్: హైదరాబాద్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు.. ఆరుగురి పరిస్థితి విషమం!

గత కొంతకాలంగా హైదరాబాద్ సహా.. పరిసర ప్రాంతాల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి.  ఇటీవల గ్యాస్ సిలండర్లు, ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, స్కూటర్లు పేలిన భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.  నిన్న రాత్రి కామారెడ్డి లో ఓ షాపింగ్ మాల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.  ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా.. అందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..

రాజేంద్రనగర్ లో ఉన్న కరాచీ బేకరీలో గురువారం పేలుడు సంభవించింది. బేకరీ కిచెన్ లో హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాద ధాటికి అక్కడే ఉన్న కార్మికులు, కొంతమంది కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి సిలిండర్ పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఫైరింజన్లు వచ్చి  మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాదం ఎలా జరిగింది.. కావాలని ఎవరైనా చేశారా? ప్రమాద వశాత్తు జరిగిందా? అన్న కోనంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి స్వయంగా ఫోన్ చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ వాసులు ఉన్నట్లు రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని కంచన్ బాగ్ డీఆర్డీఓ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం చేపుతుంది.