iDreamPost
android-app
ios-app

వీడియో: కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే సతీమణి..

వీడియో: కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే సతీమణి..

ప్రతి ఒక్కరికి భావోద్వేగాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. కానీ కొందరు బయటకు చూపిస్తుంటారు, మరికొందరు చూపించరు అంతే. ఇలా భావోద్వేగాలకు ప్రజాప్రతినిధులు ఏమి అతీతులు కాదు. అందుకే వారు కూడా తరచూ పలు సందర్భాల్లో ఎమోషనలై.. కన్నీరు పెడుతుంటారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య టికెట్ రాలేదని కన్నీటి పర్యతం అయ్యారు. అలానే ములుగు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కావడంతో నాగజ్యోతి కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే సతీమణీ కంటతడి పెట్టుకునారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గద్వాల ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్యే సతీమణి బి.జ్యోతి తెలిపారు. గద్వాల  బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ సారీ కూడా కృష్ణ మోహన్ రెడ్డికే టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో  ఇప్పటి నుంచి ఎమ్మెల్యే సతీమణి ఇంటింటి ప్రచారం  చేపట్టారు.  ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా తమపై కుట్రలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో 38వేల భారీ మోజార్టీతో ప్రజలు తన భర్తను గెలిపించారని అన్నారు.

తన భర్త గెలుపును జీర్ణించుకోలేక కొందరు ఎన్నికల ముందట మళ్లీ కుట్రలు చేస్తురన్నారని జ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు.  అయినా న్యాయస్థానాలైప తమకు నమ్మకం ఉందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రింకోర్టులో సవాలు  చేస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే టికెట్ దక్కిందనే ఆనందంలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నాగ జ్యోతి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. మరి.. ఇలా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు!