Krishna Kowshik
మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ పథకం వచ్చిన నాటి నుండి విశేష ఆదరణ చూరగొంటుంది. అయితే ఇదే సమయంలో ప్రయాణీకులతో పాటు కండక్టర్లు కూడా ఇబ్బందులకు గురౌతున్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ పథకం వచ్చిన నాటి నుండి విశేష ఆదరణ చూరగొంటుంది. అయితే ఇదే సమయంలో ప్రయాణీకులతో పాటు కండక్టర్లు కూడా ఇబ్బందులకు గురౌతున్నారు.
Krishna Kowshik
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మహాలక్ష్మి ఫ్రీ బస్సు జర్నీ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే రేవంత్ రెడ్డి.. ఈ పథకం అమలుపై సంతకాలు చేశారు. మహిళలు, విద్యార్థినులు, యువతులకు, ట్రాన్స్ జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 9 నుండి ఈ స్కీం అమల్లోకి వచ్చింది. ముందుగా ట్రయల్ రన్ వేసి.. ఆ తర్వాత రాష్ట్రంలోని మహిళలకు, అమ్మాయిలకు మాత్రమే వర్తింపజేశారు.ఏదైనా గుర్తింపు కార్డుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలు చేసిన నాటి నుండి అనూహ్య స్పందన వచ్చింది. బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక్కడే అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి.
ఫ్రీ బస్సు జర్నీ పథకాన్ని వినియోగించుకుంటున్నారు రాష్ట్ర మహిళలు. దీంతో బస్సుల్లో విపరీతమై రద్దీ పెరిగిపోయింది. పల్లె వెలుగు బస్సుల దగ్గర నుండి సిటీలోని మెట్రో సర్వీసుల వరకు బస్సులన్నీ జనాలతో నిండిపోయి కిటకిటలాడుతున్నాయి. కొంత మంది బస్సుల్లో వేలాడుతూ ప్రమాదకర ప్రయాణాన్ని చేస్తున్నారు. ఈ సమయంలో బస్సులో ఉంటున్న కండక్టర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రయాణీకుల నుండి తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారు. ఇటీవల ఆధార్ కార్డు విషయంలో ఓ యువతి మహిళా కండక్టర్‌తో గొడవకు దిగిన సంఘటన మర్చిపోక ముందే.. ఇప్పుడు మరో కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఆర్టీసీ అధికారుల ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్సు డ్రైవర్స్, కండక్టర్లకు. అలాగే ప్రయాణీకుల భద్రత కూడా ముఖ్యం. ఈ పథకం వచ్చిన నాటి నుండి బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అలాగే బస్సు డోర్లు, మెట్ల వద్ద వేలాడుతూ చాలా మంది జర్నీ చేస్తున్నారు. దీని వల్ల ఏదైనా జరిగితే.. ముందుగా ఊడిపోయేవి కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగాలే. అందుకే డోర్ వద్ద ఎవ్వరూ ఉండవద్దని హితవు పలుకుతున్నారు కండక్టర్లు. కానీ కొంత మంది వినిపించుకోకుండా అలాగే వేలాడుతూ పోతున్నారు. తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులో మహిళా ప్రయాణీకులు ఎక్కారు. డోర్ వద్ద ఉన్నారని పైకి ఎక్కాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు.
బస్సు బూర్గంపాడు వద్దకు రాగానే.. మరికొంత మంది మహిళా ప్రయాణీకులు ఎక్కారు. అయితే పైకి జరగాలని.. కోరడంతో మహిళలు పైకి ఎక్కలేదు సరికదా.. కండక్టర్‍పై తిరిగి రివర్స్ అయిపోయారు. తిట్టడం మొదలు పెట్టారు. దీంతో కంటతడి పెడుతూ.. బస్సు నుండి దిగిపోయింది కండక్టర్. దీంతో బస్సు నిలిచిపోయింది. ఆ సమయంలో మహిళా కండక్టర్.. భావోద్వేగానికి గురయ్యారు.. ‘పైకి జరగండి అని అడిగితే తిరిగి మాపై రివర్స్ అవుతున్నారు. జరగండి అంటే జరగమని చెబుతున్నారు. వాళ్లకు ఏమైనా జరిగితే.. కండక్టర్లదే కదా బాధ్యత. ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాం’ అంటూ ఆవేదన చెందుతున్నారు. మరీ కండక్టర్ పడుతున్న ఇబ్బందులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఫ్రీ బస్.. ఏడుస్తున్న కండక్టర్లు…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకంతో కండక్టర్లు కష్టాలు పడుతున్నారు. తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ… pic.twitter.com/l4CTENAySL
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023