iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క కారణంతోనే ఎంత పని చేశావు తల్లీ!

  • Published Sep 26, 2024 | 3:20 PM Updated Updated Sep 26, 2024 | 3:20 PM

Bhadrachalam Crime News:ఈ మధ్య కొంతమంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్లడం.. ఎదుటి వారిపై దాడులు చేయడం, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

Bhadrachalam Crime News:ఈ మధ్య కొంతమంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్లడం.. ఎదుటి వారిపై దాడులు చేయడం, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

ఆ ఒక్క కారణంతోనే ఎంత పని చేశావు తల్లీ!

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. మంచి చదువు, ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతుంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా మనస్పర్థలు రావడం, గొడవలు జరగడంతో మనస్థాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. పెద్దలను, సన్నిహితులను సంప్రదించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పెద్దగా చేస్తున్నారు. తాజాగా ఓ యువతి చిన్న కారణంతోనే ఎవరూ ఊహించని పని చేసింది. వివరాల్లోకి వెళితే..

కరకగూడెం మండలం కలవలనగరం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అక్షర(18) భద్రాచలంలో ఇంటర్మీడియట్ చదువుతుంది. గత కొన్ని రోజులుగా అక్షర వ్యవహరిస్తున్న తీరులో మార్పు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అక్షర ను పదే పదే ఎంక్వేయిరీ చేయడం, మందలించడం జరుగుతుంది.  కొన్ని రోజులుగా అక్షర తీవ్ర మనస్థాపానికి గురవుతూ వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్షర 15 రోజుల క్రితం పురుగుల మందు తాగింది.

ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు ఎక్కువగా సేవించడం వల్ల ఆమె పరిస్థితీ పూర్తిగా  విషమంగా మారడంతో వరంగల్ లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా బంగారం లాంటి భవిష్యత్ ని కాదనుకొని ఆత్మహత్యకు పాల్పపడటం విచారం అని అంటున్నారు గ్రామస్థులు. బిడ్డ చనిపోవడంతో పుట్టెడు దుఖఃంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు.