iDreamPost
android-app
ios-app

ఖమ్మంను వెంటాడుతున్న సెప్టెంబర్ ముప్పు.. ఏం జరిగిందంటే?

  • Published Sep 02, 2024 | 11:46 AM Updated Updated Sep 02, 2024 | 11:46 AM

Bhadrachalam: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రంతల్లో ప్రజలు ప్రాణలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందులో ఖమ్మం జిల్లా వాసులైతే ఈ సెప్టెంబరు నెల రావడంతో మరీంత భయంతో గజ గజ వణికిపోతున్నారు. అసలు ఈ సెప్టెంబర్ నెల వస్తే ఖమ్మం జిల్లా వాసులు ఎందుకంత భయపడుతున్నారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Bhadrachalam: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రంతల్లో ప్రజలు ప్రాణలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందులో ఖమ్మం జిల్లా వాసులైతే ఈ సెప్టెంబరు నెల రావడంతో మరీంత భయంతో గజ గజ వణికిపోతున్నారు. అసలు ఈ సెప్టెంబర్ నెల వస్తే ఖమ్మం జిల్లా వాసులు ఎందుకంత భయపడుతున్నారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 02, 2024 | 11:46 AMUpdated Sep 02, 2024 | 11:46 AM
ఖమ్మంను వెంటాడుతున్న సెప్టెంబర్ ముప్పు.. ఏం జరిగిందంటే?

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. మొత్తం రెండు రాష్ట్రాలు కూడా క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా కుండపోత వర్షాలతో దంచికొట్టింది. పలు జిల్లాలో అయితే వరుణుడు భీభత్సం సృష్టించడనే చెప్పవచ్చు. ఎందుకంటే.. భారీ వర్షాలు కారణంగా పల ప్రాంతల్లో నదులు, చెరువులు, కాలువాలు, వాగులలో వరద నీరు చేరిపోయి పొంగిపొర్లాయి. దీంతో రహదారులన్ని జలమైయమవ్వడంతో పాటు.. లోతట్టు ప్రాంతల్లో నివసించే చాలామంది ఇళ్లలో నీరు చేరిపోయాయి.అంతేకాకుండా.. ఈ వరద ఉధృతికి ప్రాణలు సైతం పొగొట్టుకున్నారు. అయితే ఈ సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు ఖమ్మం జిల్లా భద్రచలం వాసులు గజగజ వణికిపోతుంటారు. పైగా ఈ నెలను ప్రమాదకరమైన ముప్పులా భావిస్తుంటారు. అంతలా ఆ నగరవాసులు భయంద్రోళనకు గువర్వడానికి కారణమేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రంతల్లో ప్రజలు ప్రాణలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందులో ఖమ్మ జిల్లా భద్రచలం వాసులైతే ఈ భారీ వర్షాలు, వరద ఉధృతికి గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల ప్రారంభమైతే చాలు అక్కడ నగరవాసులకు భయంద్రోళనకు గురవుతుంటారు. ఎందుకంటే.. గతంలో ఈ సెప్టెంబర్ నెలలో చాలా సార్లు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా 1978లో 54.2 అడుగులు, 1994లో 58.6 అడుగులు, 2005లో 54.9 అడుగులు, 2011లో 43.3, 2014లో 56.1, 2019లో 51.2 అడుగుల మేర గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద ఇదే సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు.. ఆ ప్రాంతపు వాసులు భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

 ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోదవరిలో నీటి ఉధృతి పెరిగి మళ్లీ ఎక్కడ భారీ వరదలు ముంచెత్తుతయోనని ఆ ప్రాంతపు వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అప్పటికే శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా.. భద్రాది రామాలయ పరిసరాల్లో వరద నీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. ఆలయ పడమర మెట్ల మార్గంలో దాదాపు నడుము లోతు నీళ్లు చేరాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉండే వివిధ దుకాణాలు, అన్నదాన సత్రాలన్నీ జలమయమయ్యాయి. దీంతో అప్పటికప్పుడు ఆ ప్రాంతపు నివాసితులు కరకట్ట వద్దకు చేరుకుని స్లూయీస్ గేట్లను తెరిపించడంతో వరద నీరు నదిలోకి వెళ్లి తాత్కాలికంగా ఉపశమనం లభించింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఎక్కువగా కొనసాగుతోంది. గత రెండురోజుల క్రితం నీటి ఉధృతి 23 అడుగులు ఉండగా, శనివారం ఉదయం 21 అడుగు మేర చేరింది. అయితే శనివారం నుంచి వరద ఉద్ధృతి పెరగటంతో ఆదివారం ఉదయం 11 గంటలకు 31.9 అడుగులకు చేరుకుంది.  దీంతో మళ్లీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు 31.2 అడుగులకు తగ్గింది. ఇకపోతే 43 అడుగులకు నీటి ఉధృతి పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక, , 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరీ, సెప్టెంబర్ నెలలో ఖమ్మ జిల్లాల భద్రచల వాసులు ముప్ప భయం వెంటడం వెనుక ఉన్న విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.