100రోజుల్లోపే ఫ్రీ కరెంట్.. రూ. 500 గ్యాస్ సిలిండర్: మంత్రి కోమటి రెడ్డి

తాము అధికారంలోకిి వచ్చిన వంద రోజుల్లోపే హామీలను అమలు చేస్తామంటూ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటి రెడ్డి.

తాము అధికారంలోకిి వచ్చిన వంద రోజుల్లోపే హామీలను అమలు చేస్తామంటూ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటి రెడ్డి.

ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని నెరవేర్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి విదితమే. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అలాగే ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి తాజాగా డ్రైవ్ కూడా చేపట్టింది. గత నెల 28 నుండి జనవరి 6 వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించిన సంగతి విదితమే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే హామీలను అమలు చేస్తామంటూ పేర్కొన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఆ మాటలనున నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో మంత్రి కోమటి రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఫ్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. వంద రోజుల్లోపే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ. 500లకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ‘ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే 30 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించారు. రాష్ట్ర అక్కా చెల్లెల్లు ఆనందంతో బిడ్డల ఇంటికి, దేవాలయాలకు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి వస్తున్నారు. ప్రతి రోజు రూ. 10 కోట్లు భారం పడుతున్నా.. భారంగా భావించడం లేదు. మా అక్కా చెల్లెమ్మలకు రోజూ రూ. 200-300 మిగిలుస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం’అంటూ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్లు .. రెండు నెలలు లేదా వంద రోజుల్లోపే అమలు చేస్తామన్నారు.  తామిచ్చిన హామీలు వంద రోజుల్లో కాదూ.. వారం లేదా రెండు రోజుల్లోనే అమలు  చేసే వాళ్లం కానీ.. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనుల వల్ల ఆలస్యం అవుతుందని అన్నారు. విద్యుత్ శాఖ గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 70 వేల కోట్ల నష్టాన్ని చూపించిందని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో అక్రమాలతో పాటు చత్తీస్ గఢ్ కరెంట్ కొనుగోళ్లలో అవినీతి బయటపడిందన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు మంత్రి కోమటి రెడ్డి. మరీ ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments