సింగరేణిలో ఉద్యోగం పేరుతో మోసం.. భార్యా భర్తలు ఏం చేశారంటే?

Bhadradri Kothagudem Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం ఎన్నో మాయలు, మోసాలు, దారుణాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ లక్షలు దోచేస్తున్నారు.

Bhadradri Kothagudem Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం ఎన్నో మాయలు, మోసాలు, దారుణాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ లక్షలు దోచేస్తున్నారు.

సొసైటీలో లగ్జరీగా బతకాలంటే డబ్బు కావాలి.. అందుకోసం ఈ మధ్య కొంతమంది రక రకాల మోసాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెప్పి లక్షలు, కోట్లు దండుకుంటున్నారు. ఇలాంటి మోసాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా.. తెలిసి తెలిసి చాలా మంది అలాంటి మోసగాళ్ల చేతుల్లో బలి అవుతూనే ఉన్నారు. స్కీములు, చిట్టీలు, తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని కోట్లు వసూళ్లు చేసి బోర్డు తిప్పుతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్ళు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎంతోమంది అమాయకులను మోసం చేస్తున్నారు. అలా మోసపోయిన దంపతులు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  సాయిరాం తండకు చెందిన  దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర  కలకం సృష్టించింది. గడ్డి మంది తాగి ఆపస్మారక పరిస్థితిలో ఉన్న భార్యాభర్తలను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. బూర్గుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన లకావత్ రత్న కుమార్, పార్వతి దంపతులు చిరు ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు. ఈ మధ్య రత్నాకర్  సీఎంఆర్ షాపింగ్ మాల్ లో జాబ్ సంపాదించాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన ఓ దళారి కలిసి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు.

సింగరేణిలో ఉద్యోగం అనగానే రత్నాకర్, పార్వతి ఎంతో సంతోషపడ్డారు.  తమ కష్టాలు తీరబోతుందని సంబర పడ్డారు. సదరు దళారి ఉద్యోగానికి కాంపిటీషన్ చాలా ఉంది.. డబ్బు వెంటనే చెల్లిస్తే ఉద్యోగం మీకు వస్తుందని.. లేదంటే వేరే వాళ్లకు పోతుందని చెప్పాడు. దళారి మాటలు పూర్తిగా నమ్మిన రత్నకుమార్, పార్వతి అప్పు చేసి మరీ అతనికి రూ.16 లక్షలు అందించారు.  డబ్బు తీసుకున్న ఆ దళారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. ఓ వైపు ఉద్యోగం రాక, అప్పులకు వడ్డీలు కట్టలేక, డబ్బు తీసుకున్నవాడు కనిపించక, అప్పల వాళ్లు పెట్టే ఇబ్బందులు భరించలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యారు భార్యాభర్తలు. గడ్డి మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Show comments