నిజంగా అద్భుతం.. నాలుగు నెలల పాపకు నోబుల్​ బుక్​ అవార్డు!

Nobel Book of World Records Award: ప్రతిభ ఉంటే ఏదైనా మన సొంతం చేసుకోవచ్చు అంటారు.. దానికి వయసుతో సంబంధం లేదు. గతంలో నెలల వయసు‌లో ఉన్న చిన్నారులు రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Nobel Book of World Records Award: ప్రతిభ ఉంటే ఏదైనా మన సొంతం చేసుకోవచ్చు అంటారు.. దానికి వయసుతో సంబంధం లేదు. గతంలో నెలల వయసు‌లో ఉన్న చిన్నారులు రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు అని ఎంతోమంది తమ సత్తా చాటుకుంటున్నారు. ఇందుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది  ఓ నాలుగు నెలల చిన్నారి. తన ప్రతిభతో  ఆ చిన్నారి నోబుల్ బుక్ అవార్డు గెల్చుకోవడం నిజంగా వండర్ అంటున్నారు నెటిజన్లు. ప్రతిభను ప్రదర్శించడానికి వయసుతో అర్హత లేదని నిరూపించింది జగిత్యాల జిల్లాకు చెందిన ఓ నాలుగు నెలల చిన్నారి. ఈ చిన్నారి జ్ఞాపక శక్తి చూసి మొదట తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తమ కూతురు ప్రతిభ అందరికీ తెలిసేలా చేశారు. ఆ చిన్నారి చేసిన  పని ఇప్పుడు స్థానికులను మాత్రమే కాదు.. ఏకంగా నోబుల్ సంస్థ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసి అవార్డు అందజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జిగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్ – మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ఫ్లాష్ కార్డులను గుర్తు పడుతుంది. దీంతో యాంగెస్ట్ టూ ఐడెంటిటీ విభాగంలో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దరఖాస్తు చేశారు తల్లిదండ్రుల. జూన్ లో 135 ఫ్లాష్ కార్డుల ఐడెంటీ వీడియోను పరిశీలించిన నోబుల్ సంస్థ చిన్నారికి అవార్డు కేటాయించినట్లు తెలిపారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషంలో మునిగిపోయారు. కేవలం నాలుగు నెలలు ఉన్న చిన్నా రికార్డు క్రియేట్ చేయడం ఎంతో గర్వించ విషయం అని ప్రశంసిస్తున్నారు.. ఈ చిన్నారి భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి అవార్డులు గెల్చుకోవాలని దీవిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ కు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య తన ప్రతిభతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకొని ఔరా అనిపించింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రమేష్, హేమ దంపతుల కూతురు కైవల్య. ఈ పాపకు 4 నెలల వయసు. ఆ వయసులోనే వివిధ పక్షులు, పండ్లు, జంతువులు, పూల ఫోటోలు గుర్తు పడుతుంది. దీంతో కైవల్య తల్లి హేమ తన పాపకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందని గ్రహించి ప్రపంచానికి తెలియజేయాలనే తపనతో ఇండయిన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు అప్లై చేసి వారి కోరిక మేరకు పాప టాలెంట్ కి సంబంధించిన వీడియో కూడా పంపించారు. వారం రోజుల తర్వాత పాప టాలెంట్ చూసి వరల్డ్ రికార్డ్స్ సెలెక్ట్స్ అయ్యిందని గుడ్ న్యూస్ చెప్పారు. అలా పాపకు నోబెల్ వరల్డ్స్ రికార్డు కి సంబంధించిన సర్టిఫికెట్, పతకాన్ని అందించారు.

 

Show comments