iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత!

  • Published May 18, 2024 | 1:51 PM Updated Updated May 18, 2024 | 1:58 PM

Medchal MLA Mallareddy Arrested: మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Medchal MLA Mallareddy Arrested: మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బ్రేకింగ్: పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత!

మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తరుచూ ఏదో ఒక వివాదంతో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ భూ వివాదంలో మల్లారెడ్డిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర లోని భూమికి సంబంధించిన వివాదం కేసులో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కోంతమంది ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి సంబంధిత వ్యక్తులతో గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూడగానే మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారితో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి శృతిమించిపోతుందని భావించిన పోలీసులు ఆక్ష్నను అదుపులోకి తీసుకొని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82 లోని తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కొంతమంది అనుచరులతో వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ భూమి చుట్టు అక్రమంగా ఫెన్సింగ్ వేశారని మల్లారెడ్డి పోలీలకు చెప్పారు. వాళ్లు అక్రమంగా వేసిన ఫెన్సింగ్ కూల్చి వేయాలని పట్టుబట్టారు. గొడవ జరుగుతున్న క్రమంలోనే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ కూల్చి వేశారు. వివాదంలో ఉన్న భూమి జోలికి వెళ్లవొద్దని ఇద్దరు నేతలకు చెప్పారు పోలీసులు.అక్కడ ఉన్న 15 మందితో మల్లారెడ్డి గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండున్న ఎకరాలు తనదే అని.. మల్లారెడ్డి చెబుతుండగా.. మిగిలిన 15 మంది 1.11 ఎకరాలు తమదని, ఒక్కొక్కరు 400 గజాలు కొనుగోలు చేశామని అంటున్నారు.

ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు. కానీ మల్లారెడ్డి మాత్రం పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. తనకు టెన్షన్ వస్తుందని.. ఇది కావాలనే చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ గొడవకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు మల్లారెడ్డి తో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.