Keerthi
TS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే TSPSC లో ఛైర్మన్ గా మాజీ DGPని నియమించారు. ఇంతకి ఆయన ఎవరంటే..
TS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే TSPSC లో ఛైర్మన్ గా మాజీ DGPని నియమించారు. ఇంతకి ఆయన ఎవరంటే..
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అనేది తీవ్ర చర్చంశనీయంగా మారింది. ఈ పరీక్షల నిర్వహణలో బోర్డు అనేక విమర్శల గురైయింది. మళ్లీ మళ్లీ పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీలో కొత్త బోర్డును నియమిస్తామన్నారు. అలాగే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు. కాగా, ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. దీంతో టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే గతంలో ఆ పదవిలోని జనార్దన్ రెడ్డి ఉన్నారు. అయితే పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇక అతనితో పాటు పలువురు సభ్యులు కూడా రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం.. మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.