iDreamPost
android-app
ios-app

రోడ్ల పక్కన టీ తాగుతున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

  • Published Jul 06, 2024 | 11:08 AM Updated Updated Jul 06, 2024 | 11:08 AM

Food Safety Officials Raid: నేటి సమాజంలో ఏది కొనాలన్నా భయపడే పరిస్తితి నెలకొంది. మనం వాడే నిత్యావసర సరుకులు పాలు, పప్పు దాన్యాలు, కారం, అల్లం ఒక్కటేమిటి నిత్యం వాడే నూనె వరకు ప్రతి ఒక్కదాంట్లో కల్తీ జరుగుతుంది.

Food Safety Officials Raid: నేటి సమాజంలో ఏది కొనాలన్నా భయపడే పరిస్తితి నెలకొంది. మనం వాడే నిత్యావసర సరుకులు పాలు, పప్పు దాన్యాలు, కారం, అల్లం ఒక్కటేమిటి నిత్యం వాడే నూనె వరకు ప్రతి ఒక్కదాంట్లో కల్తీ జరుగుతుంది.

  • Published Jul 06, 2024 | 11:08 AMUpdated Jul 06, 2024 | 11:08 AM
రోడ్ల పక్కన టీ తాగుతున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

ఈ మధ్య కాలంలో కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎన్నో అక్రమాలు, మోసాలకు తెగబడుతున్నారు. మనుషుల ప్రాణాలకు హాని ఉంటుందని తెలిసి కూడా పలువురు వ్యాపారులు నిత్యావసర సరుకుల్లో కల్తీకి పాల్పపడుతున్నారు. ఉదయం మనం తాగే పాలు, టీ నుంచి మొదలు ప్రతి ఒక్కటీ కల్తీ అవుతున్నాయని అంటున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సెఫ్టీ అధికారులు హూటల్స్, రెస్టారెంట్స్ మొదలుకొని రోడ్డు పక్కన వ్యాపారాలు చేసే వారి వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు.ఫుడ్‌ సేప్టీ తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

ఆరోగ్యానికి మంచి ఆహారం బలం ఇస్తుంది.. ఇది ప్రతి ఒక్క డాక్టర్ చెబుతున్న విషయమే. కానీ.. ఈ కాలంలో మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది.. మనం తినే ప్రతి ఆహారపదార్థాల్లో కల్తీ కలుస్తుంది. ఏం తినాలన్నా.. తాగాలన్నా కల్తీనే. ముఖ్యంగా నగరాల్లో ఈ దారుణ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హూటల్స్, రెస్టారెంట్స్ తో పాటు వీధి దుకాణాల్లో ఫుడ్ సెఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైటెక్ సిటీలోని రోడ్డు సైడ్ దుకాణాల్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది టీ పొడిలో క్యాన్సర్ కి కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ లో వాడే మసాలాలు, సాస్ లో కూడా డేంజరస్ కలర్స్ వాడుతున్నట్లు తెలిసింది. FSSAI మొబైల్‌ ల్యాబ్ ద్వారా అక్కడే పరిశీలించి వ్యాపారులు వాడుతున్న ఆహార పదార్ధాల్లో కల్తీ జరిగినట్లు నిర్దారించారు అధికారులు.

ప్రజల ప్రాణాలకు రిస్క్ ఉందని తెలిసి కూడా కొంతమంది వ్యాపారులు కల్తీ పదార్ధాలతో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. తాగే టీ, తినే ఫుడ్ లో ప్రాణాంతకమైన రంగులు కలపడం, అతి తెలియక ప్రజలు తినడం, తాడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించిన విషయాలు తెలిసిన తర్వాత వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బయట ఫుడ్ తినాల్సి వస్తుంది.. కానీ వ్యాపారులు చేస్తున్న దారుణాలు తెలిసి గుండె పగిలిపోతుందని అంటున్నారు వినియోగదారులు. వ్యాపారాలు నాణ్యతా ప్రమాణాలు పాటించకున్నా, అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ వ్యాపారం చేసినా, ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపినా లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.