iDreamPost

హైదరాబాద్ లో వెలుగులోకి మరో హోటల్ నిర్వాకం! ఇక్కడ తింటే చావే!

తెలంగాణ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై  కొరడ ఝుళిపిస్తుంది. ఈ క్రమంలోనే వైద్యం, ఆహారంకి సంబంధించిన వాటిపై దాడులు చేస్తూ అక్రమాలను బయట పెడుతుంది. తాజాగా మరో హోటల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై  కొరడ ఝుళిపిస్తుంది. ఈ క్రమంలోనే వైద్యం, ఆహారంకి సంబంధించిన వాటిపై దాడులు చేస్తూ అక్రమాలను బయట పెడుతుంది. తాజాగా మరో హోటల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లో వెలుగులోకి మరో హోటల్ నిర్వాకం! ఇక్కడ తింటే చావే!

ఇటీవల కాలంలో హోటల్ నాణ్యతకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో బయట ఫుడ్ తిన్నాలంటే జనం జక్కుతున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో అనేక లోపలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక ఫుడ్ విషయంలో నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు కొరడ ఝూళిపించారు. అంతేకాక ఇంకా ఫుడ్ సేఫ్టి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హోటల్ భాగోతం బయటపడింది.

తెలంగాణ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై  కొరడ ఝుళిపిస్తుంది. ఈ క్రమంలోనే వైద్యం, ఆహారంకి సంబంధించిన వాటిపై దాడులు చేస్తూ అక్రమాలను బయట పెడుతుంది. పుడ్ విషయంలో నాణ్యత పాటించని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్న హోటల్ కు నోటీసులు జారీ చేశారు. పలు ఆహార గోడౌన్ లను సీజ్ కూడా చేశారు. ఇంకా దారుణం ఏమిటంటే..ఈ నాణ్యతను పాటించని వాటిల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే అనేక హోటళ్లపై దాడి చేసిన అధికారులు ఇంకా వాటిని కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలు పాటించన హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝళిపిస్తున్నారు.

ఇటీవలే సోమవారం మాదాపూర్ లోని నారాయణ సొసైటీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. అదే విధంగా దోశ వేసే పెనం అపరిశుభ్రంగా చిలుము పట్టి ఉండడాన్ని అధికారుల గమనించారు. ఆహార పదార్థాలను గ్రైండింగ్ చేసే ప్రాంతంలో ఇతర పదార్థాలు కలిసే విధంగా గలీజ్ గా ఉండటాని అధికారులు గుర్తించారు. వాష్ ఏరియా చాలా దారుణంగా ఉండటం అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆహార భద్రత నిబంధనల ప్రకారం.. శుభ్రత పాటించని ఆ హోటల్, రెస్టారెంట్ల అందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రతిఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని,  రూల్స్ కి  విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని  అధికారులు హెచ్చరించారు.

అదే సమయంలో ఈ హోటళ్ల కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో జనాలు భయపడిపోతున్నారు. ఇదే సమయంలో శుభ్రత లేని, అపరి శుభ్రమైన ప్రాంతంలో వండిన ఆహారం తిన్నడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలోనే  గ్యాస్ట్రిక్​సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అదే విధంగా దీర్ఘకాలంలో మాత్రం కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.  మొత్తంగా హైదరాబాద్ లో మరో హోటల్ నాణ్యత లోపం బయటపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి