ప్రముఖ ఫోక్ సింగర్, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. జానపద గీతాలు పాడటంలో సాయిచంద్ మంచి పేరు సంపాదించారు. తెలంగాణ ఉద్యమం టైమ్‌లో ఆయన పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు. కుటుంబంతో కలసి కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్న టైమ్‌లో ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సాయిచంద్‌ను నాగర్‌కర్నూల్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్లో చేర్పించారు.
సాయిచంద్‌ను బతికించడానికి డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణ వార్తతో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఉద్యమకారులు, ప్రజలు షాక్‌కు గురయ్యారు. సాయిచంద్ కన్నుమూసి ఇంకా వారం కూడా కాలేదు. ఆయన లేరనే బాధను కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టైమ్‌లో సాయిచంద్ సతీమణి రజని తీవ్ర అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకరంగా మారింది. సోమవారం సాయంత్రం ఆమెకు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే రజనీని గుర్రంగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారని తెలుస్తోంది.
సాయిచంద్ భార్య రజనీకి డాక్టర్లు ట్రీట్మెంద్ అందిస్తున్నారని తెలిసింది. ఆమె హెల్త్ కండీషన్ ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న రజనీ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో గుండె నొప్పి రావడంతో బీఎన్‌రెడ్డి నగర్‌లోని కోణార్క్ డయాగ్నస్టిస్ సెంటర్‌కు ఆమెను తీసుకెళ్లారట. భర్తను పోగొట్టుకున్న బాధలో ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఆమె నీరసించిపోయారట. తీవ్ర ఒత్తిడితో రజినీకి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె అస్వస్థతకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా స్పందించలేదు.