Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఈమెకే..! సీఎంగా రేవంత్ సంతకం..

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఈమెకే..! సీఎంగా రేవంత్ సంతకం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సొంతం చేసుకొని రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతుంది. ఇందుకోసం ఎల్ బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సొంతం చేసుకొని రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతుంది. ఇందుకోసం ఎల్ బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లను హైలెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారు. ఈ క్రమంలోనే 64 స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతుంది. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందు కోసం హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ప్రతి సంవత్సరం ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో మొదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తా అని అక్టోబర్ లో టీపీసీసీ అధ్యక్షుడి హోదా ఉన్న రేవంత్ రెడ్డి మీడియా వేధికగా హామీ దివ్యాంగురాలు అభయ హస్తం అందించిన విషయం తెలిసిందే. నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే యువతి తాను మరుగుజ్జుగా ఉన్నానని.. పీజీ పూర్తి చేసినప్పటికీ తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని అక్టోబర్ లో రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి తన కష్టాన్ని చెప్పింది. రజినీ కష్టం గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి చలించిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.. సీఎం ప్రమాణ స్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్య నేతలు విచ్చేస్తారు. అదే రోజు వాళ్ల ముందే.. కాంగ్రెస్ పార్టీ తోలి ఉద్యోగం నీకే ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. అనుకున్నట్లుగానే రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల తాను స్వయంగా గ్యారెంటీ కార్డు రాసి ఇచ్చిన రజినీకా తొలి ఉద్యోగం ఉచ్చేందుకు సిద్దమైతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపు ప్రమాణ స్వీకారానికి దివ్యాంగురాలు రజినీకి కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం ఇచ్చిన మాట ప్రకారం రజినీకి తొలి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్న రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments