రైలులో మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం!

Fire at Kazipet Railway Station: ప్రజలు రైలు ప్రయాణాలు ఎంతో సురక్షితం అని అనుకుంటారు.. సుదూర ప్రయాణాలు ఎక్కువగా రైల్లోనే చేస్తుంటారు. ఇటీవల రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Fire at Kazipet Railway Station: ప్రజలు రైలు ప్రయాణాలు ఎంతో సురక్షితం అని అనుకుంటారు.. సుదూర ప్రయాణాలు ఎక్కువగా రైల్లోనే చేస్తుంటారు. ఇటీవల రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రయాణాలకు ఎంతో సురక్షితంగా భావించే రైలు ప్రయాణాలు విషాదంగా మారుతున్నాయి. గత ఏడాది ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో 300 మంది వరకు చనిపోయారు. వేయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఈ ప్రమాదం తర్వాత దేశంలో మరికొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్లో మంటలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.. ఈ ఘటన కాజీపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాజీపేట రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైల్లో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైల్ బోగి నుంచి హఠాత్తుగా మంటలు, పొగలు రావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఉరుకులు.. పరుగులు పెట్టారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే గూడ్స్ రైలు నుంచి వస్తున్న పొగలను చూసి సంబంధిత అధికారులన అలర్ట్ చేశారు. రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది బోగీలో మంటలను అదుపు చేశారు. గూడ్స్ లో బొగ్గు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Show comments