iDreamPost
android-app
ios-app

షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో నష్టం!

  • Published Dec 14, 2023 | 9:44 AM Updated Updated Dec 14, 2023 | 10:35 AM

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మాన తప్పిదాలు, షార్ట్ సర్క్యూట్స్, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మాన తప్పిదాలు, షార్ట్ సర్క్యూట్స్, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో నష్టం!

ఈ మద్య కాలంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టమే కాదు.. కోట్లలో ఆస్తి నష్టం జరుగుతుంది. కొంతమంది వ్యాపార సముదాయాల్లో ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ విషయాల్లో నిర్లక్ష్యం చేయడం.. సమయానికి ఫైర్ కంట్రోల్ చేయలేక పోవడం వల్ల ప్రమాదాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. వ్యాపారస్తులకు, పలు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు అధికారులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా.. తగు చర్యలు తీసుకుంటున్నా వారిలో మార్ప రావడం లేదు. సాధారణంగా కెమికల్ ల్యాబ్స్, ప్లాస్టీక్ గోదాములు, క్రాకర్స్ ఫ్యాక్టరీలు, వస్త్ర సముదాయాలు, షాపింగ్ మాల్స్ లో ఖచ్చితంగా సేఫ్టీ ఫైర్ అందుబాటులో ఉండాలి. తాజాగా కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

కామారెడ్డి లో ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది. అయ్యప్ప షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి 11.030 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించి క్రమంగా షాపింగ్ మాల్ నాలుగంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో మాల్ లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు శ్రమ తీసుకొని రెండు అంతస్తుల్లో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జేసీపీ సాయంతో షాపింగ్ మాల్ లోని షట్టర్లను తొలగించి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

fire accident in kamareddy

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో రహదారులను బ్లాక్ చేశారు. పరిసరాల్లో ఉన్న షాపు యజమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. భారీగా మంటలు ఎగసి పడటంతో పక్కనే ఉన్న ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.8  పైగా నష్టం వాటిల్లు ఉంటుందని అంచనావేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రి పూట జరగడంతో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. ఎవరైనా కావాలని నిప్పంటించారా? లేక ఇతర కారణమా? అన్న కోణంలో  విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.