iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం..! ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

  • Published Dec 22, 2023 | 9:28 AM Updated Updated Dec 22, 2023 | 10:28 AM

ఈ మద్య హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చలికాలం.. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ మద్య హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చలికాలం.. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.

బ్రేకింగ్: పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం..! ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

ఈ మద్య హైదరాబాద్ లో అగ్నిప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది.  ఫ్యాక్టీరీలు, షాపింగ్ మాల్స్ ముఖ్య ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నా..  కొంతమంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మనుషుల తప్పిదాలు, షాట్ సర్క్యూట్ ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరగడం.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రమాదం జరగడంతో భారీగా ఆస్తినష్టం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు అగ్ని మాపక సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటూనే ఉన్నారు.. తాజాగా పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో మరోసారి అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాగుట్టలోని నాలుగో అవంతస్తులో ఈ మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని కాపాడిన ఫైర్ సిబ్బంది కాపాడారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రిస్క్యూ టీమ్ కాపాడే ప్రయత్నం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ప్రాణాలకు తెగించిన అందరినీ రక్షించారు. ఓ వైపు అగ్ని ప్రమాదంలో ప్రజలు భయంతో వణికిపోతూ పరుగులు తీస్తున్న సమయంలో సమయస్పూర్తి ప్రదర్శించిన ప్రాణాలు కాపాడిన సదరు కానిస్టేబుల్ సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా..? లేదా గ్యాస్ సిలిండర్ లీక్ కారణం అయి ఉండవొచ్చా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.