Venkateswarlu
Venkateswarlu
ఈ మధ్యకాలంలో ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువయిపోయాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రెండు వారాల క్రితం అహ్మదాబాద్‌లోని సాహిబాద్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మరువక ముందే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాలను తొందరగా గుర్తించటం వల్ల పెను ముప్పు తప్పింది. ప్రాణ నష్టం కూడా సంభవించలేదు.
తాజాగా, హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పేషంట్లు, ఇతర జనం భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లాలోని వేయిస్తంభాల గుడి దగ్గర శ్రీనివాస కిడ్నీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది. బుధవారం ఈ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్ని గుర్తించిన పేషంట్లు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు.
ఆస్పత్రిలోనుంచి బయటకు పరుగులుపెట్టారు. ఇక, ఆస్పత్రిలో మంటలపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. మరి, శ్రీనివాస కిడ్నీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.