అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో స్థానికులు పరుగులు!

అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో స్థానికులు పరుగులు!

ఈ మద్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది.

ఈ మద్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది.

ఈ మద్య హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం శీతాకాలం.. కొంతమంది వేడి కోసం అగ్నిమంటలు వేస్తుంటారు. ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదవశాత్తు వ్యాపంచి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంద. షాపింగ్ మాల్స్, వస్త్ర దుఖానాలు, గోదాముల, బానా సంచ, కెమికల్ ఫ్యాక్టీరీల్లో తప్పని సని ఫైర్ సేఫ్టీ నిబంధలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు జనావాసాల మధ్య ఏదైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఫైర్ సేఫ్టీ తప్పకుండా ఉంచుకోవాలి. కానీ కొంతమంది నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు.. అగ్రి ప్రమాదం సంభవిస్తే ఫైర్ సిబ్బంది వచ్చి కంట్రోల్ చేయాల్సి వస్తుంది. తాజాగా హైదరాబాద్ అత్తాపూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల హదరాబాద్ లో అగ్నిప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయింది.. ఐదు రోజుల క్రితం గుడిమల్లాపూర్ అంకుర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎర్రమంజిల్ లో 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా హైదరాబాద్.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర కలకలం రేగింది. సులామేన్ నగర్ ఎంఎండీ పహాడీ లో ఉన్న కట్టెల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న సోఫా తయారు చేసే ఫ్యాక్టరీకి వ్యాపించాయి. దీంతో రెండు గోదాములు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తుంది. అసలే చలికాం.. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా ఊపిరి పీల్చుకునేందు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. క్షణాల్లో రెండు గోదాముల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి చిన్న పిల్లలను తీసుకొని బయటకు పరుగులు తీశారు.

అగ్ని ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇది కావాలని ఎవరైనా చేశారా? షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.. కానీ ఆస్తి నష్టం బాగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జనావాసాల మధ్య గోదాములు, ఫ్యాక్టీరీలకు అనుమతులు ఇవ్వొద్దని.. ఒకవేళ ఇస్తే ఎక్కడ కూడా ఫైర్ సెఫ్టీ కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షించాలని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

Show comments