iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్ : Hyd లో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో టెన్షన్

  • Published Dec 11, 2023 | 9:54 AM Updated Updated Dec 11, 2023 | 9:54 AM

ఇటీవల హైదరాబాద్ నగరంలో పలు చోట్లు అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీల్లో సెఫ్టీ ఫైర్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో పలు చోట్లు అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీల్లో సెఫ్టీ ఫైర్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

బ్రేకింగ్ : Hyd లో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో టెన్షన్

ఇటీవల హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లుతుంది. సాధారణంగా వ్యాపార సముదాయాల్లో ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు వెంటనే అదుపు చేయలేకపోతున్నారు. అధికారులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా.. చర్యలు తీసుకుంటున్నా కొంతమంది వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా క్రాకర్స్ గోదాములు, కెమికల్ ల్యాబ్స్, ప్లాస్టీక్ గోదాములు, వస్త్ర సముదాయాల్లో సేఫ్టీ ఫైర్ అందుబాటులో ఉండాలి. తాజాగా హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్ లోని ఓ ప్లాస్టీక్ గోదాములో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చలికాలంలో ఇలా హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజాలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు మంటలు ఆర్పడానికి నానా తంటాలు పడ్డారు ఫైర్ సిబ్బంది. గోదాంలో ఎక్కవగా ప్లాస్టీక్ నిల్వ ఉండటంతో భారీ నష్టమే వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్లాస్టీక్ గోదాంలో అగ్ని మంటతో పాటు దట్టంటా పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు టెన్షన్ కి గురయ్యారు. చిన్న పిల్లలు, వృద్దులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. అయితే గోదాంలో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అంటున్నారు. గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.