బ్రేకింగ్ : నిలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నగరంలో మరో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుంది.

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నగరంలో మరో అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుంది.

వేయడం వల్ల పొరపాటున నిప్పు రవ్వలు వేరే ప్రదేశాల్లో పడి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా బాణాసంచా ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీలు, ప్లాస్టీక్ గోదాములు, టింబర్ డిపోలు, వస్త్ర సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. కానీ కొంతమంది ఆ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ లో తరుచూ అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం తీవ్ర కలకం రేపింది. బుధవారం నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో మొదటి అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టమైన పోగ వ్యాపించింది. మంటలు ఇతర అంతస్తుటకు వ్యాపించడంతో బిల్డింగ్ లో ఉన్న డాక్టర్లు, పేషెంట్లు, చిన్నపిల్లలు వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో ఉంది. మొదటి అంతస్తు లో ల్యాబ్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం పై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాని సందిస్తూ.. ‘ నీలోఫర్ ఆస్పత్రి పాత భవింతిలోని మైక్రోబయలాజీ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది.. ఈ కారణంతోనే అక్కడ మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ సిబ్బందిని పిలిపించి చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె తెలిపారు. మరోవైపు నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందారు.

Show comments