iDreamPost
android-app
ios-app

TG Budget 2024-25:భూమిలేని రైతు కూలీలకు రేవత్ సర్కార్ తీపికబురు.. ఏడాదికి రూ.12 వేలు!

  • Published Jul 25, 2024 | 3:27 PM Updated Updated Jul 25, 2024 | 3:27 PM

Good News for Farmers: తెలంగాణలో నేడు గురువారం (జులై 25) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

Good News for Farmers: తెలంగాణలో నేడు గురువారం (జులై 25) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

TG Budget 2024-25:భూమిలేని రైతు కూలీలకు రేవత్ సర్కార్ తీపికబురు.. ఏడాదికి రూ.12 వేలు!

నేడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశ పెట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని.. నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. విద్యా, వైద్య, మహిళా సంక్షేమంపై పోకస్ పెట్టినట్లు భట్టి తన ప్రసంగంలో తెలిపారు.  బడ్జెట్‌లో తెలంగాణ రైతులపై వరాల జల్లు కురిపించింది రేవంత్ సర్కార్. బడ్జెట్ లో భారీ నిధులు కేటాయించింది. రైలు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఆ నిధులు వినియోగనించనున్నట్లు తెలిపింది. అంతే కాదు ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ వ్యాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూల ధన వ్యయం రూ.33,487 కోట్ల రూపాలయ ప్రతిపాదించారు.. ఈ బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి పెద్ద పీట వేశారు రేవంత్ సర్కార్. బడ్జెట్ లో మొత్తం రూ.72,659 కోట్లను రైతాంగానికి కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నిధులు వాడబోతున్నట్లు తెలిపింది. అలాగే గ్యాస్ సబ్సిడీ పథకానికి 723 కోట్లు కేటాయించింది. గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది కి రూ.29 వేల 816 కోట్లు కేటాయించింది.

ఈ సందర్భంగా అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. ‘ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువ శాతం రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఎటువంటి ఆర్థిక భద్రత లేకపోవడంతో కొన్ని రోజులు పస్తులు పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. భూమి లేని రైతు కూలీలు ఇకపై ఆర్థిక కష్టాలు పడకూడదని రేవంత్ సర్కార్ భావించింది. వారి ఆర్థిక స్థితి గతులు మార్చేందుకు బడ్జెట్ లో భారీ నిధులు కేటాయించాం. లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంతలో స్పష్టం చేశారు.