Arjun Suravaram
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత గులాబీ పార్టీ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ ఓటమితో పలువురుఅధికారులు తమ పదవులకు రాజీమాలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత గులాబీ పార్టీ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ ఓటమితో పలువురుఅధికారులు తమ పదవులకు రాజీమాలు చేశారు.
Arjun Suravaram
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఈ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ విజయం సాధిచంగా.. కారుకు బ్రేకులు పడ్డాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న గులాబీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన సాగింది. ఈ సమయంలో ఎంతో మంది అధికారులు, వ్యక్తులు వివిధ హోదాలు పొందారు. తాజాగా బీఆర్ఎస్ ఓటమితో పలువురు అధికారులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు అధికారులు తమ పోస్టులకు రాజీనామా చేశారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ఓడిపోవడంతో రాజీనామాల పర్వం మొదలైంది. వివిధ హోదాల్లో ఉన్న పలువురు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తెలంగాణ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధా కిషన్ రావు రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రభుత్వానికి పంపారు. రాధాకిషన్ రావు మూడేళ్ల క్రితం తన పదవీ కాలం ముగిసినా టాస్క్ ఫోర్స్ లోనే కొనసాగుతున్నారు. ఇటీవలే ఎలక్షన్ల విధుల నుండి రాధాకిషన్ రావును ఎన్నికల కమిషన్ తొలగించింది.
అదే విధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు కూడా..తన పదవికి రాజీనామా చేసేశారు. తన రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కు ఓఎస్డీగాపని చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో తన పదవిని ఆయన వదిలుకున్నారు. మూడేళ్ల క్రితమే ప్రభాకర్ రావు పదవి విరమణ చేశారు. అయితే కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయనను యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ వింగ్ అధికారిగా నియమించారు. గతంలో ప్రభాకర్ రావు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారని ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లిప్రభాకర్ రావు సైతం తన పదవికి రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ సలహాదారులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి రాజీనామా చేశారు. మరి.. బీఆర్ఎస్ ఓటమి తరువాత అధికారులు వరుస రాజీనామాలు చేయడంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.