P Venkatesh
పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావించే తల్లిదండ్రుల పట్ల కొంతమంది కుమారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అన్నం పెట్టని కొడుకులకు ఓ తండ్రి ఊహించని షాక్ ఇచ్చాడు.
పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావించే తల్లిదండ్రుల పట్ల కొంతమంది కుమారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అన్నం పెట్టని కొడుకులకు ఓ తండ్రి ఊహించని షాక్ ఇచ్చాడు.
P Venkatesh
రాను రాను సమాజంలో మానవతా విలువలు, ఆప్యాయతా అనురాగాలు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను క్షోభకు గురిచేస్తున్నారు కొంతమంది పిల్లలు. డబ్బు కోసం, ఆస్థి కోసం ఎంతటి దారుణానికైనా సిద్ధపడుతున్నారు కొందరు వ్యక్తులు. తాము కన్న పిల్లల కోసం తల్లిదండ్రులు అహర్నిషలు కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఆఖరికి పిరికెడు అన్నం కూడా పెట్టకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తమ జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ కొందరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. ఇదే రీతిలో ఓ తండ్రి కొడుకులు సరిగా చూడటం లేదని, అన్నం కూడా పెట్టడం లేదని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది.
వయసు మల్లిన తల్లిదండ్రులకు పిరికెడు మెతుకులు పెట్టడానికి ముందుకు రాని కొడుకులు వారు సంపాదించిన ఆస్థిని కాజేసేందుకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ రాష్ట్రంలో ఓ కొడుకు ఆస్థి కోసం తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి ప్రాణాలను తీసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇంట్లోనుంచి బయటకు గెంటేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. కాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మం. అలీపూర్ కు చెందిన బాలయ్య అనే వ్యక్తి కొడుకులు తనకు అన్నం పెట్టడం లేదని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
కొడుకులే లోకంగా బ్రతికిన తనను సరిగా చూడడం లేదని మనస్థాపానికి గురైన బాలయ్య తన యావ దాస్తిని కొండగట్టు అంజన్నకు సమర్పించేందుకు రెడీ అయ్యారు. అనుకున్నదే తడవుగా ఆయన ఆస్థికి సంబంధించిన పత్రాలతో కొండగట్టుకు చేరుకున్నారు. అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన తన స్థిర చర ఆస్తికి సంబంధించిన పత్రాలను కొండగట్టు దేవస్థానంలోని హుండీలో వేయాలని భావించాడు. కానీ చివరి నిమిషంలో పూజారులు అడ్డుకున్నారు. ఆ హుండీలో వేస్తే ఆ ఆస్తి అంజన్నకి చెల్లదని పూజారులు చెప్పారు. దీంతో తన ఆస్తిని కొండగట్టు అంజన్న పేరు మీద పట్టా చేస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కోరారు. తండ్రి తీసుకున్న నిర్ణయంతో ఆయన కొడుకులకు షాక్ తగిలినట్లైంది.