iDreamPost
android-app
ios-app

వీడియో: అప్పు తిరిగి ఇవ్వాలంటూ.. కుటుంబం ఆత్మహత్యాయత్నం!

వీడియో: అప్పు తిరిగి ఇవ్వాలంటూ.. కుటుంబం ఆత్మహత్యాయత్నం!

తినడానికి తిండిలేని వాడినుంచి.. వేల కోట్లకు పడగలెత్తిన కుబేరుల వరకు అందరికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది మరేంటో కాదు.. అప్పు. అవును ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్లు అప్పు చేస్తూనే ఉంటారు. పదులతో మొదలు పెట్టి వేల కోట్ల వరకు కూడా అప్పులున్న వాళ్లు ఉన్నారు. ఈ అప్పుల మీద ఎప్పుడూ ఒక జోక్ నడుస్తూ ఉంటుంది. అప్పు వచ్చే వరకు తీసుకునే వాడు తిరుగుతాడు.. అప్పు అందాక ఇచ్చిన వాడు తిరగాలి అని. కొన్ని సందర్భాల్లో అది సరిగ్గా నిజం అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే మరి.

అప్పుకు సంబంధించి చాలానే సినిమాలు, జోకులు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూసుంటారు. పెద్దలు చెప్పే మంచి మాట ప్రాణం పోయినా అప్పు చేయద్దు అని. కొందరి పరిస్థితి చూస్తే ప్రాణం పోయినా అప్పు ఇవ్వకండి అని కూడా చెప్పాలి అనిపిస్తుంది. ఏదో కష్టాల్లో ఉన్నారని, అవసరం ఉందని, లేదంటే వడ్డీ వస్తుందని.. ఇవా కారణం ఏదైనా తమ వద్దు ఉన్న సేవింగ్స్ ని అప్పుగా ఇచ్సేస్తుంటారు. తీసుకున్న వాళ్లు చక్కగా తిరిగిస్తే ఎలాంటి గోలా ఉండదు. లేదంటే ఇదిగో ఈ కుటుంబం మాదిరిగానే అప్పు తీసుకున్న వాళ్ల ఇంటి ముందుకు వెళ్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితి రావచ్చు అంటున్నారు. ఈ ఘటన గోదావరిఖనిలో జరిగింది. కల్యాణ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి రూ.ఆరున్నర లక్షలు అప్పుగా ఇచ్చాడు.

అయితే ఎంత అడిగినా కైలాసం ఆ అప్పు తిరిగి ఇవ్వడంలేదని శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా అతని ఆర్థిక పరిస్థి అసలేం బాలేదని చెప్పినా కైలాసం డబ్బు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, కుమార్తెతో కలిసి కైలాసం ఇంటి ముందుకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ తన భార్య, తన కుమార్తెపై ఒంటిపై కిరోసిన్ పోశాడు. తన వంటిపై కూడా కిలోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే స్థానికులు వారిని ఆపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను విచారిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీకి ఆశపడి లక్షలు అప్పుగా ఇస్తే ఇలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొందరైతే అన్ని లక్షలు అప్పుగా ఇచ్చావు అంటే ఏదైనా తాకట్టు పెట్టుకుంటావుగా దానిని అమ్మేసి నీ డబ్బు తీసుకో అంటూ సూచిస్తున్నారు. ఇంకొందరు అది మొండి బాకీ వీళ్లు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇవ్వరు అంటూ కామెంట్ చేస్తున్నారు.