P Venkatesh
టీఎస్ డీఎస్సీకి దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
టీఎస్ డీఎస్సీకి దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
P Venkatesh
ఎంతో కాలం నుంచి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇటీవలే ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సెప్టెంబర్ 20 2023 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. కాగా డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీని అక్టోబర్ 21 2023 గా నిర్ణయించారు. దీని ప్రకారం రేపటితో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ క్రమంలో డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్ధుల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. ఆ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది పాఠశాల విద్యాశాఖ.
స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీల భర్తీకి సంబంధించి పాఠశాలల్లో 5089 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే రేపటితో డీఎస్సీ దరఖాస్తుల గడువు ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువు తేదీని పొడిగించింది. ఈ నెల అనగా అక్టోబర్ 28 వరకు గడువు పొడిగించింది. అక్టోబర్ 28 వరకు గడువు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇటీవలె డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీఆర్టీ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వాయిదా పడ్డాయి. నవంబర్ 30న పోలింగ్ ఉండడంతో అధికారులు వాయిదా వేశారు. కాగా పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. కాగా ఈ డీఎస్సీలో అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీపడనున్నారు.