Smita Sabharwal: స్మిత సబర్వాల్‌పై సంచలన ట్వీట్.. “దేశంలో హెలికాప్టర్‌లో తిరిగే IAS ఆమె ఒక్కరే”

మాజీ అధికారి ఒకరు.. స్మితా అధికారిపై సంచలన పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

మాజీ అధికారి ఒకరు.. స్మితా అధికారిపై సంచలన పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలువురు అధికారులు రాజీనామాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కామ్ అయిపోయారు. కొందరు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. గత ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా పని చేసిన ఆమె.. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో దూరంగా ఉంటున్నారని సమాచారం.

కనీసం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలవలేదంటూ విమర్శలు వస్తున్నాయి. అంతేకాక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమె.. డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ అధికారి ఒకరు స్మితా సబర్వాల్ ను ఉద్దేశించి చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. ఆ వివరాలు..

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి.. స్మితా సబర్వాల్ ను ఉద్దేశించిన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ’’గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లి (అక్కడి క్యాస్ట్ కనెక్షన్, నెట్ వర్క్), ఇక్కడ చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్‌లకు ఫ్యాషన్ అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వీళ్లను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలి. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం. దేశంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే‘‘ అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఐఏఎస్ స్మితా సభర్వాల్ విషయానికి వస్తే.. ఆమె గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. సీఎంవో కార్యదర్శిగా విధులు నిర్వహించారు. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయనను కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2001లో ట్రైనీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్మితా సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. పని తీరు విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందారు. తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.

Show comments