iDreamPost

కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

  • Published Feb 05, 2024 | 12:17 PMUpdated Feb 05, 2024 | 12:17 PM

తెలంగాణలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా కాంగ్రెస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

తెలంగాణలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా కాంగ్రెస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

  • Published Feb 05, 2024 | 12:17 PMUpdated Feb 05, 2024 | 12:17 PM
కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

ఇటీవల సీనీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల, వయోభారం ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం దుఖఃంలో మునిగిపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నేతలు వరుసగా కన్నుమూస్తున్నారు. గత నెలలో కంటోన్ మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్ రావు కన్నుమూశారు.. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నుమూయడంతో అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

పెద్దపల్లి కాంగ్రెస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నేత, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ప్రియతమ నాయకుడు ఇక లేరన్న వార్త విని పెద్దపల్లిలో తీవ్ర విషాదం అలుముకుంది.. పలువురు కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.. కన్నీరు పెట్టుకున్నారు.

ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో 1930 లో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు రాజమల్లు. చిన్ననాటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ లో చేరి తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారు. టీడీపీలో పలు హూదాల్లో పనిచేసిన ఆయన సుల్తానాబద్ పీఏసీఎస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1994 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2018 లో బీఆర్ఎస్ లో చేరిన ఆయన 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మృతిపట్ల ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి